ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam: కొత్తగా మరిన్ని డిపోలు, బస్‌స్టేషన్లు!

ABN, Publish Date - Jan 19 , 2025 | 03:53 AM

రాష్ట్రంలో పలు కొత్త బస్‌ డిపోలు, బస్‌ స్టేషన్లను నిర్మించడంతోపాటు ప్ర స్తుతం ఉన్న బస్‌ స్ట్టేషన్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ బోర్డు నిర్ణయించింది. బస్‌ భవన్‌లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశం జరిగింది.

  • ప్రస్తుతం ఉన్న వాటి విస్తరణకు చర్యలు

  • ఆర్టీసీ బోర్డు సమావేశంలో నిర్ణయాలు

  • కొత్త బస్సులు, సదుపాయాలపై దృష్టి: పొన్నం

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పలు కొత్త బస్‌ డిపోలు, బస్‌ స్టేషన్లను నిర్మించడంతోపాటు ప్ర స్తుతం ఉన్న బస్‌ స్ట్టేషన్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ బోర్డు నిర్ణయించింది. బస్‌ భవన్‌లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త డిపోల ఏర్పాటుతోపాటు ప్రస్తుతం ఉన్న 97 డిపోలు, బస్‌ స్టేషన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిందని, అం దుకు అనుగుణంగా బస్‌స్టేషన్లను విస్తరిస్తామని చెప్పారు.


కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడతామని తెలిపారు. కాగా, పెద్దపల్లిలో రూ.11.70 కోట్లు, ములుగు జిల్లా ఏటూరునాగారంలో రూ.6.28 కోట్లతో కొత్త బస్‌డిపోలు ఏర్పాటు చేయాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ములుగులో రూ.5.11 కోట్లు, హుజూర్‌నగర్‌లో రూ.3.75 కోట్లు, కోదాడ వద్ద రూ. 17.95 కోట్లు, మధిరలో రూ.10కోట్లు, ములుగు జిల్లా మంగపేటలో రూ.51లక్షలతో కొత్త బస్‌స్టేషన్లు నిర్మించేందుకు బోర్డు అనుమతించింది. అలాగే, పెద్దపల్లి జిల్లా మంథని బస్‌స్టేషన్‌ను రూ.95 లక్షలతో విస్తరించాలని నిర్ణయించింది. ‘సరస్వతి పుష్కరాల’ దృష్ట్యా కాళేశ్వరంలో ఆధునిక బస్‌స్టేషన్‌ నిర్మాణానికి రూ. 3.95 కోట్లు కేటాయిస్తూ బోర్డు అనుమతులిచ్చింది.

Updated Date - Jan 19 , 2025 | 03:53 AM