నత్తనడకన రోడ్డు పనులు
ABN, Publish Date - Jul 19 , 2025 | 01:31 AM
ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులు నత్తనడకలా సాగుతున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నత్తనడకన రోడ్డు పనులు
ఏడాదిగా కొనసాగుతున్న పనులు
ప్రమాదాలకు గురవుతున్న ప్రయాణికులు
పట్టించుకోని అధికారులు
తిప్పర్తి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులు నత్తనడకలా సాగుతున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. తిప్పర్తి మండల పరిధిలోని మామిడా ల గ్రామం మీదుగా ఆగమోత్కూర్ వరకు 12.8 కిలోమీటర్ల సింగిల్ రోడ్డును డబుల్‌రోడ్డుగా మార్చేందుకు గాను రూ. 44 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం మే నెలలో పనులు కూడా ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కంకర పోసే పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అదే విధంగా కంకర పోసిన తర్వాత పూర్తి స్థాయిలో రోడ్డు రోలర్‌తో తొక్కకపోవడంతో కంకర తేలిన రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాక రాళ్లు సరి గ్గా ఉండకపోవడంతో వాహనాలు వెళ్లినప్పుడు వాటి రాపిడికి రాళ్లు ఎగిరివచ్చి ప్రయాణికులకు తగులుతుండటంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అదే రోడ్డుపైన మామిడాల మీదుగా యాపలగూడెం, యల్లమ్మగూడెం, గోదోరిగూడెం, ఆరెగూడెం వంటి పలు గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై నిత్యం రాకపోక లు చేస్తుంటారు. ఈ క్రమంలో నిరంతరం వాహన రాకపోకల కారనంగా కంకరంతా రోడ్డు మధ్యలోకి చేరి ద్విచక్ర వాహనదారులు వెళ్తున్న క్రమంలో ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారు.
దుమ్ములేస్తోంది
రోడ్డు పనులు చేస్తున్న సమయంలో కంకర, డస్ట్ పోసి రోలర్‌తో తొక్కిన తర్వాత తగినంతగా నీళ్లు చల్లినట్లయితే ప్రయాణికులకు, రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకు కూడా ఎలాంటి దుమ్ము పడకుండా ఉంటుంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సమయానికి నీళ్లు చల్లకపోవడంతో రోడ్డుపై లేసిన దుమ్ము కారణంగా ప్రయాణికు లు అవస్థలు పడుతున్నారు.
ద్విచక్ర వాహనంపై ఒక్కరే ప్రయాణం
రోడ్డుపైన అధికంగా దిబ్బలు దిబ్బలుగా కంకర ఉండటంతో ద్విచక్రవాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనంపై ఒక్కరు ప్రయాణం చేయడమే కష్టంగా మారింది. అత్యవసరమై ఒకరికి మించి ప్రయాణిస్తే రోడ్డు మధ్యలో ఎక్క డో ఓ చోట కిందపడిపోవాల్సిన పరిస్థితి. ఇదే రోడ్డుపై నిత్యం సుమారుగా కొన్ని వందల వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నందున రోడ్డు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి
మా గ్రామానికి వెళ్లే రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయా లి. వ్యక్తిగత పనుల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు వెళ్లి రాత్రిసమయంలో ఇంటికి చేరుకోవాలంటే కంకర రోడ్డులో వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు కలుగజేసుకొని రోడ్డు పనులు వేగవంతం చేయించాలి.
- సోమయ్య, మామిడాల గ్రామస్థుడు
ప్రయాణికులకు లేకుండా చర్యలు
ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం.రోడ్డు పనులు నడుస్తున్నందున ప్రయాణికులకు అసౌకర్యంగా కలుగుతుం ది. పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తాం.
- గౌస్, ఆర్‌అండ్‌బీ ఏఈ
Updated Date - Jul 19 , 2025 | 01:31 AM