ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్రికెట్‌ పోటీల విజేత ఆర్‌కే-7 జట్టు

ABN, Publish Date - May 01 , 2025 | 11:50 PM

మే డేను పురస్కరించుకొని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) శ్రీరాంపూర్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నర్సయ్య స్మారక క్రికెట్‌ పోటీల్లో ఆర్‌కే 7 జట్టు విజేతగా నిలించింది. శ్రీరాంపూర్‌ డివిజన్‌లో ఉన్న యువ కార్మికులకు నెల రోజులుగా పోటీలు నిర్వహిస్తుండగా గురు వారం ఫైనల్స్‌ జరిగాయి.

శ్రీరాంపూర్‌, మే 1(ఆంధ్రజ్యోతి): మే డేను పురస్కరించుకొని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) శ్రీరాంపూర్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నర్సయ్య స్మారక క్రికెట్‌ పోటీల్లో ఆర్‌కే 7 జట్టు విజేతగా నిలించింది. శ్రీరాంపూర్‌ డివిజన్‌లో ఉన్న యువ కార్మికులకు నెల రోజులుగా పోటీలు నిర్వహిస్తుండగా గురు వారం ఫైనల్స్‌ జరిగాయి. ఫైనల్స్‌లో ఆర్‌కే 7, ఆర్‌కే న్యూటెక్‌ జట్లు పోటీ పడగా, ఆర్‌కే 7 విజయం సాధించింది. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌ కుమార్‌, సీపై రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కల వేని శంకర్‌ ముఖ్య అతిథులుగా హాజరై ఇరు జట్లకు బహుమతులు అందించారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా తులసిరామ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా అనిల్‌, బెస్ట్‌ బ్యాటర్‌గా నరేందర్‌, బెస్ట్‌ బౌలర్‌గా మహేష్‌ లకు సైతం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ఉప ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కె సమ్మయ్య, బ్రాంచ్‌ కార్యదర్శి బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్‌ రావు, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ సకినాల నర్సయ్య, జనరల్‌ కెప్టెన్‌ శ్రీనివాస్‌, నాయకులు అఫ్రోజ్‌ఖాన్‌, సంపత్‌, బద్రి బుచ్చయ్య, గొల్లపల్లి రాంచందర్‌, నవీన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 11:51 PM