మెగా వైద్య శిబిరానికి స్పందన
ABN, Publish Date - Jun 07 , 2025 | 11:20 PM
వైద్య శిబిరాలను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని శనివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించం సంతోషకరని రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా కార్యవర్గ సభ్యు లు, వైద్య శిబిరం ప్రోగ్రాం ఆర్గనైజర్ మదుసూదన్‌రెడ్డి, ప్రముఖ కంటి వై ద్యులు సిహెచ్. నర్సయ్య పేర్కొన్నారు.
మంచిర్యాలకలెక్టరేట్,జూన్7(ఆంధ్రజ్యోతి): వైద్య శిబిరాలను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని శనివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించం సంతోషకరని రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా కార్యవర్గ సభ్యు లు, వైద్య శిబిరం ప్రోగ్రాం ఆర్గనైజర్ మదుసూదన్‌రెడ్డి, ప్రముఖ కంటి వై ద్యులు సిహెచ్. నర్సయ్య పేర్కొన్నారు. శనివారం రెడ్‌క్రాస్ సంస్థ ఆర్‌వీఎం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందు లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య శిబిరం ద్వా రా ప్రజల్లో ఆసుపత్రుల పట్ల స్పష్టమైన అవగాహన వస్తుందని చికిత్స పట్ల శ్రద్ధ పెరుగుతుందన్నారు. అనంతరం ముఖ్య అతిథిని, ప్రత్యేక వైద్య బృం దాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. 18ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వైద్య శిబిరాలను సైతం ప్రజల సౌకర్యార్థం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌సంస్థ జిల్లా కార్యదర్శి చందూరి మహేందర్, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎడ్ల కిషన్, శంకర్‌వర్మ, సత్య నారాయణరెడ్డి, సంతోష్‌కుమార్, హరీశ్, సత్యనారాయణరావు, రెడ్‌క్రాస్ సం స్థ, ఆనంద నిలయం సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 07 , 2025 | 11:20 PM