ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చింతపండు చోరీ ఘటనపై నేడు నివేదిక?

ABN, Publish Date - Jun 19 , 2025 | 12:19 AM

యాదగిరికొండపైన ఇటీవల జరి గిన చింతపండు దొంగతనం కేసులో దోషులను తేల్చేందుకు దేవాదాయ అదనపు కమిషనర్‌ నేతృత్వంలో హైలెవల్‌ కమిటీ విచారింది.

యాదగిరిగుట్ట, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): యాదగిరికొండపైన ఇటీవల జరి గిన చింతపండు దొంగతనం కేసులో దోషులను తేల్చేందుకు దేవాదాయ అదనపు కమిషనర్‌ నేతృత్వంలో హైలెవల్‌ కమిటీ విచారింది. రెండు రోజుల పాటు విచారణ చేసిన కమిటీ సభ్యులు గురువారం నివేదిక అందజేయనున్న ట్లు తెలిసింది. అధికారులు, ఉద్యోగులను వేర్వేరుగా విచారించి ఎంతకాలంగా దొంగతనం జరుగుతుంది? అని ప్రశ్నించారు. కాగా, నమోదు చేసుకున్న నివేదిక పట్ల దేవస్థానంలో చర్చనీయాంశమైంది. దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేర కు మధు, గణేష్‌ ఇద్దరు నిందితుల వాంగ్మూలానికి తోడు మరో నింది తుడిగా భావిస్తున్న దిలీప్‌ కూడా వంటస్వాముల ప్రొద్బలంతోనే దొంగతనానికి పాల్పడి నట్లు చెప్పగా, ప్రసాదాల తయారీలో పనిచేసిన వంటస్వాములను బాధ్యు లను చేసి అలసత్వం కింద చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

విజిలెన్స్‌ తనిఖీలు

వార్షిక తనిఖీల్లో భాగంగా విజిలెన్స్‌ అధికారులు బుధవారం కొండపై తని ఖీలు చేపట్టారు. ఉదయం ఇక్కడకు చేరుకున్న అధికారులు దేవస్థాన పరిధిలో ప్రీ అడిట్‌, పోస్టు అడిట్‌ ఎప్పటి వరకు జరిగాయి? టెండర్లల్లో దేవాదాయ కమిషనర్‌ అనుమతి ఉందా? లేదా? అనే అంశాలను తనిఖీ నిర్వహించారు. ప్రసాదాల తయారీలో ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? తదితర అంశాలను కూడా పరిశీలించారు. ప్రభుత్వానికి నిర్ణయించిన చెల్లింపులు చేస్తున్నారా? లేదా? అడిట్‌ నివేదికను అనుసరిస్తున్నారా? అంశాలను పరిశీలించారు.

Updated Date - Jun 19 , 2025 | 12:19 AM