ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శాస్త్రోక్తంగా నిత్యపూజలు

ABN, Publish Date - Jul 30 , 2025 | 11:21 PM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు.

యాదగిరిగుట్ట, జూలై 30(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిఅమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టామూర్తులను అభిషేకరించి తులసీ దళాలతో సహస్రనార్చనలు నిర్వహించారు. ప్రధానాలయం అష్టభుజి ప్రాకార మండపంలో స్వామిఅమ్మవారిని అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిత్య పూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామికి రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.11,77,677ల ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్‌. వెంకట్రావు తెలిపారు.

Updated Date - Jul 30 , 2025 | 11:21 PM