రసాయనాల వినియోగం తగ్గించుకోవాలి
ABN, Publish Date - May 15 , 2025 | 11:13 PM
సాయన ఎరువులు పరిమితికి మిం చి వాడరాదని, తద్వారా అధికదిగు బడి వస్తుందని పాలెం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ సిద్దప్ప, దివ్య అన్నారు.
- పాలెం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు సిద్దప్ప, దివ్య
తాడూరు, మే 15 (ఆంధ్రజ్యోతి) : రసాయన ఎరువులు పరిమితికి మిం చి వాడరాదని, తద్వారా అధికదిగు బడి వస్తుందని పాలెం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ సిద్దప్ప, దివ్య అన్నారు. గురువారం మండలం లోని సిర్సవాడ గ్రామ రైతువేదికలో రైతు ముం గిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగం గా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించా రు. సాగునీటి వినియోగం, మొక్కల పెంపకం వంటి అంశాలపై ప్రత్యేకంగా రైతులకు అవగా హన కల్పించారు. వారు మాట్లాడుతూ ప్రతీ రైతు వ్యవసాయ భూమికి పశువుల పేడతో కూడిన ఎరువులు వాడినట్లయితే భూమి బలా న్ని పెంచినవారమవుతామన్నారు. కార్యక్రమం లో పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కళాశాల సి బ్బందితో పాటు ఏవో సందీప్‌కుమార్‌రెడ్డి, ఏఈవో, గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి
కల్వకుర్తి : రైతులు భూసారాన్ని కాపాడుకు నేందుకు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవి ద్యాలయం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతి అన్నారు. గురువారం మండలంలోని పంజుగు ల గ్రామంలో రైతుల సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఏఈవో పాషా, యువ శాస్త్రవేత్తలు గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - May 15 , 2025 | 11:13 PM