ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రజతోత్సవానికి సిద్ధం

ABN, Publish Date - Apr 26 , 2025 | 11:24 PM

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తెలంగాణ ప్ర త్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత గులాబీ పార్టీ రెండు సార్లు అధికారం చేపట్టింది.

-నేడు వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ

-జన సమీకరణకు సన్నాహాలు

-జిల్లా నుంచి తరలనున్న పదివేల మంది పార్టీ శ్రేణులు

మంచిర్యాల, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తెలంగాణ ప్ర త్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత గులాబీ పార్టీ రెండు సార్లు అధికారం చేపట్టింది. మూడోసారి కూడా పీఠం ఎక్కాలనే ఉత్సాహంలో ఉన్న ఆ పార్టీకి కాం గ్రెస్‌ పార్టీ బ్రేకులు వేసింది. గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఇంతకాలం పాటు గులాబీ బాస్‌ కేసీఆర్‌ మౌనం వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత ఆయన తిరిగి ప్రజా క్షేత్రం లోకి వెళ్లడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తెచ్చేందు కు సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ (అప్పటి టీ ఆర్‌ఎస్‌) 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించగా, ఆది వారంతో 25 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భం గా రజతోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణ యించారు. అందుకు వేదికగా వరంగల్‌ను ఎంచు కోగా బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు.

పదేళ్లపాటు తిరుగులేని పార్టీగా...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత 2014 ఎన్నిక ల్లో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించగా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ 10 సీట్లకుగాను ఏడు స్థా నాల్లో గెలుపొందింది. అనంతరం 2018 ఎన్నికల్లో ఏ కంగా తొమ్మిది స్థానాలను గెలుచుకోగా, ఆసిఫాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన ఆత్రం సక్కు విజయం సాధించారు. ఆ తరువాత ఆయన కూడా గులాబీ పార్టీలో చేరడంతో మొత్తం పదికి పది స్థానాల్లో పాగా వేసింది. అలా రెండు పర్యాయాలు ఉమ్మడి జిల్లాలో తిరుగులేని పార్టీగా రికార్డును సొంతం చేసుకుంది. మూడో పర్యాయం కూడా అదే ఊపుతో బరిలో దిగినప్పటికీ అనూహ్య ఓటమి ఎదు రైంది. 2023 ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని బోథ్‌, ఆసిఫాబాద్‌ నియో జకవర్గాల్లో మాత్రమే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అనిల్‌ జాదవ్‌, కోవ లక్ష్మి గెలుపొందారు.

పార్టీని వీడిన అగ్రనాయకులు...

2023 ఎన్నికల్లో రాష్ట్రంలో ఓటమి పాలైన బీఆర్‌ ఎస్‌ను పలువురు అగ్ర నేతలు వీడారు. 2019లో పె ద్దపల్లి ఎంపీగా గెలిచిన బోర్లకుంట వెంకటేశ్‌నేత 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. చెన్నూరు ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు పదవిని అలంకరించిన నల్లాల ఓదెలు కూడా పార్టీని వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఓదెలుతోపాటు ఆయన సతీమణి అప్పటి జిల్లా ప రిషత్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న నల్లాల భాగ్యలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఆసిఫాబాద్‌ నుంచి ఆత్రం సక్కు సైతం కాంగ్రెస్‌లో చేరగా, అక్కడి మరో అగ్రనేత కో నేరు కోనప్ప కూడా కాంగ్రెస్‌ పంచన చేరారు. అలా గే మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ను వీడి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ దం డే విఠల్‌ కూడా బీఆర్‌ఎస్‌ను వీడి, కాంగ్రెస్‌లో చేరా రు. ఆయా నేతలతోపాటు వారి అనుచరగణం కూ డా పెద్ద సంఖ్యలో పార్టీని వీడారు. అయితే మం చిర్యాల జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయినా మం చిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల మా జీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, బాల్క సు మన్‌, దుర్గం చిన్నయ్యలు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు.

జిల్లా నుంచి పదివేల మందిని తరలించే యోచన....

వరంగల్‌ బహిరంగ సభకు జిల్లాలోని మూడు ని యోజక వర్గాల నుంచి పదివేల మంది పార్టీ శ్రేణు లను తరలించేందుకు ఆయా నియోజక వర్గాల మా జీ ఎమ్మెల్యేలు సన్నాహాలు చేస్తున్నారు. రజతోత్సవ సభపట్ల కొద్ది రోజులుగా పార్టీ శ్రేణులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నియోజక వర్గానికి మూడు వేల చొప్పున తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. బహిరంగ సభను విజయవం తం చేయడం ద్వారా జిల్లాలోనూ బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బా ల్క సుమన్‌ కూడా తనదైన శైలిలో కృషి చేస్తున్నారు.

ప్రజలంతా బీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారు...

బాల్క సుమన్‌

వరంగల్‌ బహిరంగ సభను విజయవంతం చేయ డం ద్వారా పార్టీ పూర్వవైభవానికి కృషి చేస్తున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్లలోపే ప్రజలు చీత్కారాలు మూటగట్టుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా కాంగ్రెస్‌ నెరవేర్చలేకపోయింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికీ ప్రజలంతా బీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:25 PM