రాజీవ్ యువవికాసంతో నిరుద్యోగులకు లబ్ధి
ABN, Publish Date - Mar 19 , 2025 | 11:22 PM
నిరుద్యోగ యు వతీ యువకులకు రాజీవ్ యు వవికాసం ద్వారా లబ్ధి చేకూ రుతుందని మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు.
- మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసులు
అచ్చంపేటటౌన్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : నిరుద్యోగ యు వతీ యువకులకు రాజీవ్ యు వవికాసం ద్వారా లబ్ధి చేకూ రుతుందని మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టినందుకు బుధ వారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవా రం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటా లకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువవికాసం పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 5 లక్షల మంది యువతకు రాయితీ రుణాలు అందుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో నాయకులు మహబూబ్‌అలీ, జబ్బు వెంకట్, శ్రీనివాసులు, నాయకులు పాల్గొన్నారు.
ఫ బిజినేపల్లి : స్థానిక అంబేడ్కర్ చౌరస్తా లో బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షుడు మిద్దె రాములు ఆధ్వర్యంలో పార్టీ నాయ కులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. అసెంబ్లీలో 42శాతం బీసీల రిజ ర్వేషన్ బిల్లుకు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏకగ్రీ వంగా ఆమోదం తెలిపి పార్లమెంటుకు నివేదిం చడం పట్ల బీసీలతో కలిసి సీఎం, స్థానిక ఎమ్మె ల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి మాట్లా డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెం కటస్వామి, తిరుపతయ్య, రాంచందర్, అమృత్ రెడ్డి, అవంతి శంకర్, బంగారి పర్వతాలు, వాల్యనాయక్, చటమోని తిరుపతయ్య, ముద్దం మధు, మహేందర్, పీర్యానాయక్, అంజాద్, అబ్జల్, నరేందర్‌గౌడ్, నాగరాజు గౌడ్, ఉన్నారు.
ఫ వంగూరు : రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచడాన్ని హర్షిస్తూ బుధవారం సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో రేవంత్‌రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశా రు. ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రం గాల్లో బీసీల ప్రాధాన్యాన్ని పెంచే విధంగా సీఎం చర్యలు చేపడు తుండడం సంతోషకర మన్నారు. కార్యక్రమంలో వేమారెడ్డి, పర్వ తాలు, వంశీ, కర్ణాకర్, రాములు, వెంకటయ్య, బాబు, శివ, అనిల్ పాల్గొన్నారు.
Updated Date - Mar 19 , 2025 | 11:22 PM