ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- వర్షాకాలం.. పాముల భయం

ABN, Publish Date - Jun 15 , 2025 | 10:46 PM

కుమరం భీం జిల్లాలో విష సర్పాల బెడద ఎక్కువగానే ఉంది. ఏటా పాముకాటులో పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. జూన్‌, జూలై నెలల్లో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి

- అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన

ఆసిఫాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లాలో విష సర్పాల బెడద ఎక్కువగానే ఉంది. ఏటా పాముకాటులో పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. జూన్‌, జూలై నెలల్లో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. బొరియల్లో ఉండే పాములు ఆహారాన్వేషణలో పొలం గట్లు, పొదల వెంట సంచరిస్తుంటాయి. ఇది గమనించక పలువురు పాము కాటుకు గురవుతున్నారు. జిల్లాలో విష సర్పాల సంఖ్య చాలా తక్కువ. కాటు వేసిన పాము విష పూర్తిమైందో కాదో ముందు తెలుసుకోవాలి. పాము కాటు వేసవిన చోట కట్టుకట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఎలాంటి పాము కాటు వేసినా వెంటనే ఆసుపత్రికి తీసుకేళ్తే 99 శాతం బతికించే అవకాశముంది. వర్షాకాలంలో చల్లదనానికి పాములు వాటి ఆవాసాల నుంచి బయటకు వస్తాయి. రాత్రి వేళల్లో నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. వానాకాలం పంట సీజన్‌లో సాగుకు సిద్ధమవుతున్న సమయంలో పాములు బయటకు రావడంతో రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

సర్పాల రకాలు, విష ప్రభావం ఇలా..

విష సర్పాలు రెండు రకాలు ఉంటాయి. న్యూరోటాక్సిల్‌ రకం నాగు పాము, కట్ల పాము, రెండో రకం హిమోటాక్సిన్‌ అంటే రక్తపించర పాము వంటి పాములు ఉంటాయి. న్యూరోటాక్సిల్‌తో నోటి ద్వారా నురుగు వచ్చి శ్వాస ఆడక మృతి చెందే ప్రమాదం ఉంది. ఇది గుండెపై ప్రభావం చూపి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. హిమోటాక్సిన్‌తో రక్తనాళాల కణాల్లో కణజాలం నశించి కాటు పడిన భాగంలో వాపు వస్తుంది. కాటేసింది ఎలాంటి పాము తెలుసుకుంటే చికిత్స చాలా సులభం. పక్క పక్కన రెండు దంతాలు కాటే వేస్తే అది ఖచ్చితంగా విష సర్పమే. పాము కాటుతో ఉన్న భాగం నుంచి శరీరంలోకి రక్త ప్రసరణలో విషం వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎటువంటి పాము కాటే వేసినా ఆసుపత్రికి వెళ్తె రెండు రకాల చికిత్సలు నిర్వహిస్తారు తీవ్రతను బట్టి ఇంజక్షన్‌ వేస్తారు. యాంటీ స్నేక్‌ వీనం, యాంటీ పాలి వీనం అనే రెండు రకాల మందులు ఉంటాయి. ప్రస్తుతం మన జిల్లాలో అన్ని ఆసుపత్రుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

ఆందోళనకు గురి కావొద్దు..

పాము కాటుకు గురైనప్పుడు ఆందోళణకు గురి కావద్దు. ఇది గుండె పోటుకు దారి తీస్తుంది. ప్రాథమిక చర్యగా కాటు వేసి ప్రదేశంపై భాగంలో కట్టు కట్టాలి. ఆ వెంటనే చికిత్స కోసం వెళ్లాలి. పాము కాటుకు గురైన వారు ఆసుపత్రికి వెళ్లి స్పష్టంగా చెప్తే దానికి సంబంధించిన చికిత్స చేస్తారు. అక్కడ యాంటీ స్నేక్‌ వీనం ఇంజక్షన్‌ అందుబాటులో ఉంటాయి. రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటే దానికి ఈ ఇంజన్‌ పని చేస్తుంది. గుండె పోటు రాకుండా ఈ మందు ఉపకరిస్తుంది. రెండో రకం నరాలపై పని చేసి మెదడుపై ప్రభావం చూపి మృతి చెందడానికి అవకాశం ఉంటుంది.

- విషకీటకాల బారిన పడకుండా..

సాధ్యమైనంత వరకు పాములు విష కీటకాల బారిన పడకుండా ఉండాలి. రాత్రి పూట పొలాల వద్ద వెళ్లే వారు కర్ర, టార్చ్‌ లైటు తీసుకెళ్లాలి. కప్పలు, ఎలుకలు ఉన్న చోట పాములు సంచరిస్తుంటాయి. ఇంటి ఆవరణలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు, రంద్రాలు, నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇళ్లలో ఎలుకలు ఉంటే పాములు వస్తాయి. చిన్నారులు రాళ్లు, చెట్ల పొదల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రాత్రి పూట పొలాలకు వెళ్లే వారు సాధ్యమైనంత వరకు పొడవాటి బూట్లు ధరించడం ఎంతో మంచిది. కట్ల పాము కాటేసిన క్షణాల్లో విషం రక్తంలోకి ప్రవేశించి మృతి చెందే అవకాశం ఉంటుంది. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. నాగు పాము కాటేసిన 15 నిమిషాల్లో విషం ఎక్కుతుంది. రక్తపింజర కాటేసిన రెండు గంటల తరువాత విషం కక్కుతుంది. జెర్రిపోతు, సిరుకట్ల పాము కాటేసినా విషం ఉండదు. ఏ కీటకం బారిన పడిన ఆసుపత్రికి వెళితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

- జిల్లాలోని ఆసుపత్రుల్లో..

జిల్లాలోని 20 పీహెచ్‌సీలు, మూడు సీహెచ్‌సీలు, రెండు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లల్లో పాము కాటు మందులు అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో సంప్రదించే అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స చేసి అవసరమైతే ఏరియా ఆసుపత్రులకు తరలించి కృత్రిమ శ్వాసను అందించి బతికించే అవకావం ఉంటుంది. ఆందోళనకు గురై ఆలస్యం చేస్తే పమాదకరంగా మారు అవకాశం ఉంటుంది.

Updated Date - Jun 15 , 2025 | 10:46 PM