ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నాణ్యమైన ధాన్యం తేవాలి

ABN, Publish Date - May 05 , 2025 | 12:09 AM

: కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌

కోదాడటౌన్‌, మే 4(ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ అన్నారు. బాలాజీనగర్‌ పీఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాన్ని, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే కేంద్రం, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే చిలుకూరు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌తో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యంలో తాలు, గడ్డి లేకుండా తేమ శాతం 17 శాతం ఉండేలా నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే వెంటనే కాంటా వేసి మిల్లులకు తరలిస్తారని తెలిపారు. గన్నీ సంచులు, లారీల సమస్యల, హమాలీల కొరత గురించి ఆరా తీశారు. లారీలు, హమాలీలు, గన్నీ సంచుల సమస్య లేదని కమిషనర్‌కు తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించి బాలాజీనగర్‌ పీఎసీఎస్‌ నుంచి 5వేల క్వింటాళ్లు, చిలుకూరు ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి 6,052 క్వింటాళ్ల ధాన్యం మిల్లులకు తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పి. రాంబాబు, ఆర్డీవో సూర్యనారాయణ, డీఆర్‌డీఏపీడీ విని అప్పారావు, తహసీల్దార్‌ వాజీద్‌అలీ, డీసీవో పద్మ, ఏపీడీ సురేష్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, వైస్‌ చైర్మన్‌ నరేష్‌, డైరెక్టర్‌ ప్రభాకర్‌, సీఈవో మంద వెంకటేశ్వర్లు, ఎంపీడీవో గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2025 | 12:09 AM