ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు గుణాత్మక విద్య

ABN, Publish Date - Jun 13 , 2025 | 11:32 PM

ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్ధులకు గుణాత్మక విద్యను అందిస్తామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శుక్రవారం మం డలంలోని ఇందారం, టేకుమట్ల, కిష్టాపూర్‌ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు.

టేకుమట్ల పాఠశాలలో విద్యార్ధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జైపూర్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్ధులకు గుణాత్మక విద్యను అందిస్తామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శుక్రవారం మం డలంలోని ఇందారం, టేకుమట్ల, కిష్టాపూర్‌ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. హాజరు పట్టికలు, రిజిష్టర్‌లు, తరగతి గదులను పరిశీలించారు. ఈసంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపే తం చేసే దిశగా అనేక చర్యలు చేపడుతోందన్నారు. ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగిం చుకుని విద్యార్ధులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాల న్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో నూతనంగా చేరిన విద్యార్ధులకు సా మూహిక అక్షరాభ్యాసం చేయించారు. నూతన మెను ప్రకారం పిల్లలకు పోషక విలువగల ఆహారాన్ని అందిం చాలని, విద్యార్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. టేకుమట్ల, కిష్టాపూర్‌ గ్రామాల్లో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను తహ సీల్దార్‌ వనజారెడ్డితో కలిసి సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ నెల 20 వరకు సదస్సులు ఉంటాయన్నారు. ఎస్‌ఐ శ్రీధర్‌, ఎంఈవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలి

భీమారం : వివిధ రకాల సమస్యల పరిష్కారం, ధృవపత్రాల జారీ కోసం వచ్చే ఆర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం భీమారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని సంద ర్శించారు. రికార్డులు, రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లా డుతూ భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులకు సంబంధించి రికార్డులను సరి చూసి క్షేత్రస్ధాయిలో విచారించి స మస్యను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయ న వెంట తహసీల్దార్‌ సదానందం, అధికారులు ఉన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 11:32 PM