ఉన్నత చదువులు చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలి
ABN, Publish Date - Mar 27 , 2025 | 11:15 PM
విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. గురువారం సాయంత్రం మల్కేపల్లిలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
కాసిపేట, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. గురువారం సాయంత్రం మల్కేపల్లిలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. గిరిజన విద్యార్థులం దరు పేద కుటుంబాలకు చెందినవారని, ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని శ్రద్దగా చదవుకో వాలన్నారు. చదువుతోనే సమాజంలో మీతో పాటు తల్లిదండ్రులకు కూడా గౌరవం పెరుగుతుందన్నారు. ఉన్నత చదువులు ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. మెను ప్రకారం బోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి హాస్టల్‌లో బస చేశారు. అంతకుముందు మల్కేపల్లి, సోనాపూర్, వెంకటాపూర్, ధర్మారావుపేట గ్రామాల్లో వయోజన విద్యా భ్యాసన కేంద్రాలను ఆయన పరిశీలించారు. వంద శాతం అక్షరాస్యత సాధించాలన్నారు. ఆయన వెంట వయోజన విద్యా జిల్లా అధికారి పురు షోత్తం నాయక్, డీఆర్‌పీ అశోక్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Mar 27 , 2025 | 11:15 PM