ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

ABN, Publish Date - May 06 , 2025 | 11:59 PM

రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని చండూరు ఆర్డీవో శ్రీదేవి ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో శ్రీదేవి

నాంపల్లి, మే 6 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని చండూరు ఆర్డీవో శ్రీదేవి ఆదేశించారు. చండూ రు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చేటప్పుడు తాలు లేకుండా తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకో వాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు , నీడను కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ దేవాసింగ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ గట్టుపల్లి నర్సిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:59 PM