ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:03 PM

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాల యంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాల యంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల, కోట పల్లి, జైపూర్‌, కోటపల్లి, లక్షెట్టిపేట, బెల్లంపల్లి, రామారావుపేట ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు దర ఖాస్తులు అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో 38 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణ పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించండి..

జిల్లా కేంద్రంలోని ప్లైఓవర్‌ కాలేజీ రోడ్డు చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్కల్ల మల్లారెడ్డి వినతి పత్రం అందించారు. కాలేజీ రోడ్డు ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కూరగాయలు రోడ్లకిరువైపులా పెట్టి విక్రయిస్తున్నారని, దీంతో పార్కిం గ్‌కు స్థలం లేక ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల రాంగ్‌ పార్కింగ్‌ పేరిట చలాన్‌ లు వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తుల మధుసూదన్‌రావు, మున్నారా జాసి సోడియా, రాము, విజయ్‌ కుమార్‌, తిరుపతిరెడ్డి, ప్రభాకర్‌రావు, మల్లేష్‌, శ్రీనివాస్‌, సునీల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:03 PM