ఎంపీని అవమానించినందుకు నిరసన
ABN, Publish Date - May 24 , 2025 | 10:29 PM
సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకుండా, ఎక్కడా ఫోటో పెట్టకుండా అవమా నించడాన్ని నిరసిస్తూ ఆలిండియా అంబేద్కర్ సంఘం నాయకులు శనివా రం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు.
చెన్నూరు, మే 24 (ఆంధ్రజ్యోతి) : సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకుండా, ఎక్కడా ఫోటో పెట్టకుండా అవమా నించడాన్ని నిరసిస్తూ ఆలిండియా అంబేద్కర్ సంఘం నాయకులు శనివా రం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత ఎంపీ అయిన వంశీకృష్ణ ఫోటో పెట్టకుండా, ఆయనను ఆహ్వానించకుండా స్ధానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బా బు అవమానించారన్నారు. వెంటనే ఎమ్మెల్యేపై అధిష్టానం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ చీఫ్ సెక్రటరీని సస్పెండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్, వెంకటి, జనగామ తిరుపతి, లింగంపల్లి మహేష్, దుర్గం వెంకటి, దాసరి కమలాకర్ పాల్గొన్నారు.
Updated Date - May 24 , 2025 | 10:29 PM