ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదివాసీ గిరిజన సంఘం నాయకుల నిరసన

ABN, Publish Date - Jul 21 , 2025 | 11:36 PM

ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబరు 49ని వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్య దర్శి సంకె రవి డిమాండ్‌చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టి జీవో కాపీలను దహనం చేశారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబరు 49ని వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్య దర్శి సంకె రవి డిమాండ్‌చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టి జీవో కాపీలను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దివాసీలను, పేదలను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలతో చెలగాట మా డుతుందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జీవో నెంబరు 49 తీసుకువచ్చి మోదీ ఎజెండాను అమలు చేస్తున్నారన్నారు. దీని వల్ల ఆదివాసీలు, పేద లు వారు నివసిస్తున్న 339 గ్రామాలను 3 లక్షల ఎకరాల భూమిని కో ల్పోతున్నారన్నారు. అడవులను, భూములను కార్పోరేట్‌ సంస్థల కు అప్పగించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలు, పేదలపై యుద్దం ప్రకటిస్తున్నాయని ఇది సరైంది కాదన్నారు. మంచిర్యాల జిల్లాలో కవ్వాల్‌ టైగర్‌ జోన్‌, ప్రాణహిత కృష్ణ జిం కల ప్రాంతం, శివ్వారం మొసళ్ల అభయార్యణం కేంద్రాల పేరుతో సగం జిల్లాను ఖాళీ చేయించే కుట్రలను గత, ప్రస్తుత ప్రభు త్వాలు చేస్తున్నాయన్నారు. ఇప్పటికే జిల్లాలో ఫారెస్టు అధికారు లు వందల మంది ఆదివాసీలు, పేదలపై అక్రమ కేసులు పెట్ట డం, జైళ్లకు పంపారని, పట్టాలున్న భూములను కూడా బల వంతంగా లాక్కుంటున్నారన్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చే యాలని లేకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు గోమాస ప్రకాష్‌, దుంపల రంజిత్‌కుమార్‌, దూ లం శ్రీనివాస్‌, రాములు, శ్రీకాంత్‌, రత్నవేణి, నిర్మల, రాంచరణ్‌, రాజ్‌కుమార్‌, మహేందర్‌ పాల్గొన్నారు.

చెన్నూరు : ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబరు 49ని రద్దు చేయా లని కోరుతూ సోమవారం చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్ర హం వద్ద తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడంతో పాటు జీవో 49 కాపీలను దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్య దర్శి ఎర్మ పున్నం, నాయకులు మహేష్‌, ఉమారాణి, సరిత, శారద పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీపీ ఎం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.

కాసిపేట: 49 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఆదివాసీ తుడుం దె బ్బ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలో బందు ప్రశాంతంగా జరిగింది. తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడె జంగు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 49 జీవో ద్వారా ఆదివాసీలను అడవికిదూరం చేస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ తుడుం దెబ్బ సంఘాల నాయ కులు మడావి వెంకటేశ్‌, పెంద్రం శంకర్‌, హన్మంతు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:36 PM