రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:42 AM
ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చి న హామీలను అమలు చేయాలని భారతీయ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
నల్లగొండ(కలెక్టరేట్), జూలై 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చి న హామీలను అమలు చేయాలని భారతీయ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాం టి షరతులు లేకుండా రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. ఎకరానికి రూ.15వేలు ఇస్తామని, పదిరకాల వ్యవసాయ ఉత్పత్తులకు క్వింటాకు రూ.500లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరపై బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. పది రకాల పంటలకు వరిధాన్యం, మొక్కజొన్న, కందులు, సోయాబీన్స్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకుకు రూ.500 బోనస్ చెల్లించాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేయాలని కోరారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్‌రెడ్డి, బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి అశోక్‌రెడి, పిల్లి రామరాజుయాదవ్, నూకల వెంకటనారాయణరెడ్డి, భవనం మధుసూదన్‌రెడ్డి, వెంకటరెడ్డి, బండారు ప్రసాద్, మిర్యాల వెంకటేశం, గడ్డం మహేష్, పోతపాక లింగస్వామి, గుండ కండ్ల సాయన్న, బీపంగి జగ్జీవన్, కట్ట వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 12:42 AM