ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించాలి

ABN, Publish Date - Jun 12 , 2025 | 11:55 PM

చెన్నూరు మున్సిపాలిటీలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. గురు వారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అద్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

చెన్నూరు, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు మున్సిపాలిటీలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. గురు వారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి మంత్రిగా బాధ్య తలు చేపట్టిన తర్వాత మొదటగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయా లన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. చెన్నూరు పట్టణం పక్కనే గోదావరి ఉన్నా శాశ్వతంగా తాగునీరు అందించడం లేదని, వెంటనే తాగు నీరందించాలన్నారు. అలాగే చెన్నూరు పట్టణంలో ప్రజలు ఇండ్లు కట్టుకోవా లంటే ఇసుక దొరకడం లేదని, చెన్నూరు పట్టణం పక్కనే గోదావరి నది వద్ద ఉన్నా ఇసుకకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం ఏంటని మండిప డ్డారు. ముఖ్యంగా చెన్నూరు పట్టణంలో దహన సంస్కారాలు చేయాలంటే ఇప్పటికి శ్మశాన వాటిక లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ర ని, శ్మశాన వాటికను వెంటనే నిర్మించాలన్నారు. మున్సిపాలిటీలో రోడ్డు, డ్రైనే జీలు సరిగ్గా లేక వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెం టనే వీటిని నిర్మించాలన్నారు. చెన్నూరులో నిర్మించిన వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ భవనం పూర్తయినా ప్రారంభించలేదని వెంటనే పారరంభించా లన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ కౌన్సిల్‌ సభ్యుడు బత్తుల సమ్మయ్య, పట్టణాధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్‌, నాయకులు కొండపాక చారి, శ్రీనివాస్‌, రాజశేఖర్‌, శ్రీకాంత్‌, నారాయణ, రాజారాం, రమేష్‌, పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 11:55 PM