ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైల్వే రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి

ABN, Publish Date - May 06 , 2025 | 11:57 PM

రైల్వే రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిం చాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు.

రైల్వేస్టేషన్‌ ఎదుట నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు

నల్లగొండ రూరల్‌, మే 6(ఆంధ్రజ్యోతి): రైల్వే రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిం చాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. సంఘం ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్‌ ఎదుట మంగళవారం ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేలో భద్రతా చర్యలు పెంచి, ప్రయాణికుల, సిబ్బంది ప్రాణాలు కాపాడాలన్నారు. దేశంలో ఇటీవల వరుసగా అనేక రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికులు, లోకో పైలట్లు, టైన్ర్‌ మేనేజర్లు, ట్రాక్‌ మైంటైనేర్స్‌, కాంటాక్ట్‌ వర్కర్స్‌ వివిధ కేడర్ల రైల్వే కార్మికులు ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. నేటికీ మనదేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి రైలు ప్రయాణమే తక్కువ ఖర్చు గల రవాణా మార్గం అని అన్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన రైల్వే వ్యవస్థను కేంద్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. కార్యక్రమంలో సీఐటీఊ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. సలీం, నాకులు దండెంపల్లి సత్తయ్య, అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:57 PM