ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ బడులు

ABN, Publish Date - Jun 04 , 2025 | 11:16 PM

జిల్లాలో ప్రైవే ట్‌ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రఽదాన పట్టణాల్లో గల్లీ గల్లీకి పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి అర్హత లేని వారు సైతం పాఠశాలలు నెలకొల్పుతూ అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యా పార దృక్పథంతో రోజురోజుకూ జిల్లా వ్యాప్తంగా ప దుల సంఖ్యలో పాఠశాలలు ప్రారంభం అవుతున్నా వి ద్యాశాఖాధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

-కనీస నిబంధనలు పాటించని యాజమాన్యాలు

-బహుళ అంతస్థుల భవనాల్లో విద్యాలయాల ఏర్పాటు

-ఆటస్థలం ఉండాలన్న నిబంధనలు గాలికి

-అర్హతలేని ఉపాధ్యాయులచే విద్యాబోధన

మంచిర్యాల, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రైవే ట్‌ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రఽదాన పట్టణాల్లో గల్లీ గల్లీకి పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి అర్హత లేని వారు సైతం పాఠశాలలు నెలకొల్పుతూ అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యా పార దృక్పథంతో రోజురోజుకూ జిల్లా వ్యాప్తంగా ప దుల సంఖ్యలో పాఠశాలలు ప్రారంభం అవుతున్నా వి ద్యాశాఖాధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 12 నుంచి నూత విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యం లో పాఠశాలలు స్థాపించి ప్రచార హోరు మోగిస్తున్నా రు. ఇరుకుల గదుల్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండానే పాఠశాలలను నెలకొల్పుతున్నారు. ఇతరత్రా రంగాలకు చెందిన వ్యాపారులు సైతం ప్రాముఖ్యత(బ్రాండెడ్‌) కలిగిన సంస్థల పేర్లను ఉపయోంచి పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రభుత్వ గుర్తింపు లేకున్నా...

జిల్లాలో నూతనంగా నెలకొలుపుతున్న కొన్ని పాఠశాలలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి గుర్తింపు లేకున్నా అడ్మిషన్లు సేకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం మొదట ప్రారంభ అనుమ తి పొందిన పిదప పాఠశాలలను ఏర్పాటు చేయాలి. అందుకు భిన్నంగా ప్లే స్కూళ్లు, కిడ్స్‌ స్కూళ్ల పేరిట కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విద్యాశాఖ నిబంధనలివీ....

పాఠశాలను ప్రారంభించేముందు విద్యాశాఖకు చ లానా రూపంలో తనిఖీ రుసుం చెల్లించి నిబంధనల మేరకు ఓపెనింగ్‌ అనుమతులు పొందాలి. అనంతరం పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమైన సౌ కర్యాలు, బోధన, బేధనేతర సిబ్బందిని నియమించాలి. అన్ని వసతులు కల్పించినట్లు ప్రతిపాధనలు తయా రుచేసి శాశ్వత గుర్తింపు కోసం ఫైల్‌ విద్యాశాఖకు అం దజేయాలి. దరఖాస్తు సమయంలో రూ. 50వేలు ఎం డోమెంట్‌ రుసుము చెల్లించాలి.

ఫవిద్యార్థులు ఆడుకోవడానికి పాఠశాలకు అనుసంధానంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు మీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆట స్థలం కలిగి ఉండాలి.

ఫఅగ్నిమాపకశాఖ అనుమతి తీసుకొని ఉండాలి. ప్రతి పాఠశాలలో అగ్నిమాపక పరికరాలు (ఫైర్‌ ఎస్టిం గిషర్స్‌, అలారం) అందుబాటులో ఉండాలి.

ఫపాఠశాల భవన స్థితిగతులతోపాటు విద్యార్థుల ఆరోగ్యం కోసం ధారాళంగా గాలి, వెలుతురు సౌకర్యాలు ఉన్నట్లు సూచించే సౌండ్‌నెస్‌, శానిటరీ సర్టిఫికేట్లు వి ద్యాశాఖ అధికారులకు అందజేయాలి.

ఫపాఠశాలల్లో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఇంటర్‌తో పాటు టీటీసీ లేదా డిగ్రీ అనంతరం బీఈడీ శిక్షణ పొంది ఉండాలి. వ్యాయామ ఉపాధ్యాయులైతే బీపీఈడీ శిక్షణ పొంది ఉండాలి.

ఫవిద్యార్థులకు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా టాయ్‌లెట్ల సౌకర్యం కల్పించాలి.

ఫతరగతి గదులు విద్యార్థులకు అనుగుణంగా వి శాలంగా ఉండటంతోపాటు గాలి, వెలుతురు ధారాళం గా వచ్చే వెసులుబాటు కలిగి ఉండాలి.

ఫవిద్యార్థుల వేథాశక్తి కోసం పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేయాలి. అందులో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాలి.

ఫపాఠశాలలో తప్పనిసరిగా కంప్యూటర్‌, టీవీ, రేడియో వంటి ప్రసార సాధనాలు అందుబాటులో ఉండా లనే నిబంధనలున్నా చాలా పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యాబోధన జరుగుతోంది.

అర్హతలేని ఉపాధ్యాయులచే విద్యాబోధన...

ప్రైవేట్‌ పాఠశాలల్లో చాలా వాటిలో అర్హత లేని ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నట్లు సమాచారం. చాలా పాఠశాలల్లో కేవలం ఇంటర్మీడియట్‌, డిగ్రీ అ ర్హతలు ఉన్నవారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నా రు. ప్రాథమిక స్థాయిలో డీఈడీ శిక్షణ పొంది ఉన్నట్లయితే విద్యార్థుల మనసత్వాన్ని ఎరిగి వారిని విద్యపట్ల ఆకర్షితులను చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత తరగతులు బోధించే ఉపాధ్యాయులకు తప్పని సరిగా బీఈడీ, తదితర ట్రైనింగ్‌ కోర్సు పూర్తిచేసి ఉం డాలి. అయితే ఎలాంటి ట్రైనింగ్‌ లేకున్నా, కేవలం అకా డమిక్‌ అర్హతలతోనే ఉపాధ్యాయులుగా నియమి స్తున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు...

డీఈవో యాదయ్య

ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు నెలకొల్పితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భవిష్యత్‌లో బోనఫైడ్‌ సర్టిఫికెట్‌లు అందక ఇబ్బందులు ఎదుర్కోవలసి వ స్తుంది. అలాగే ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయంలో తనిఖీలు నిర్వహిస్తాం. ఆటస్థలాలు లేని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తాము. వేల రూపాయలు దారపోసి చదివించే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గుర్తింపు ఉండి అన్ని రకాల సౌకర్యాలు ఉన్న పాఠశాలల్లోనే చేర్పించాలి.

Updated Date - Jun 04 , 2025 | 11:16 PM