Private medical colleges: స్టైపెండ్ దోపిడీపై మెడికోల ఆందోళన
ABN, Publish Date - May 25 , 2025 | 05:14 AM
ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు స్టైపెండ్ దోపిడీపై నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు వేసి, మళ్లీ వాటిని డ్రా చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో పనిచేస్తున్న హౌజ్ సర్జన్స్, పీజీ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ప్రతి నెలా తమకు చెల్లించాల్సిన స్టైపెండ్‌ను కాలేజీ యాజమాన్యాలే జేబుల్లో వేసుకుంటున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. తాము శ్రమ దోపిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఏటా ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదివే పీజీ విద్యార్థుల స్టైపెండ్‌సుమారు రూ.500 కోట్లను యాజమాన్యాలు తమ జేబుల్లో వేసుకుంటున్నట్లు మెడికోలు ఆరోపిస్తున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనలమేరకు ప్రతి పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థికి ప్రతి నెలా స్టైపెండ్ చెల్లించాలని, కానీ ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే యాజమాన్యాలు డ్రా చేసుకుంటున్నాయని వారు చెబుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఏడాదిపాటు చదివిన కాలేజీలోనే ఇంటర్న్‌షిప్ చేయాలి. ఆ సమయం లో నెలకు రూ.25,906 ఇస్తారు. పీజీ విద్యార్థులకైతే మొదటి ఏడాది రూ.58,289, రెండో ఏడాది రూ.61,528, మూడో ఏడాది రూ.64,767 ఇవ్వాలి. పీజీ డిప్లొమా వారికి మొదటి ఏడాది రూ.58,289, సెకండియర్‌కు రూ.61,528 చొప్పున ప్రతి నెలా చెల్లించాలని 2023లో ప్రభుత్వం జీవో నంబరు 59 జారీ చేసింది.
ఇలా వేసి.. అలా డ్రా..
ప్రైవేటు వైద్య విద్య కాలేజీల్లో చదువుతున్న పీజీలకు చేరిన వెంటనే కళాశాల యాజమాన్యాలు తమ క్యాంప్‌సలోని బ్యాంకులోనే ఖాతా తెరవాలని నిబంధనలు పెడుతున్నాయి. ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు ప్రతి విద్యార్థికి స్టైపెండ్ చెల్లిస్తున్నట్లు చూపేందుకు విద్యార్థుల ఖాతా లో ప్రతి నెలా స్టైపెండ్ వేస్తారు. అయితే విద్యార్థి కాలేజీలో చేరిన తొలి ఏడాదే మూడేళ్లపాటు ఇచ్చే స్టైపెండ్ మొత్తానికి 36 విత్‌డ్రా ఫామ్‌లు వారి వద్ద తీసుకుంటున్నారు. కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి 36 చె క్కులు తీసుకుంటున్నాయి. మరికొన్ని విద్యార్థుల నుంచి ఏటీఎమ్ కార్డులు తీసుకుంటూ డబ్బులు డ్రా చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కాలేజీల మెడికోలు నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..
Updated Date - May 25 , 2025 | 05:14 AM