ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

ABN, Publish Date - Jul 25 , 2025 | 12:20 AM

గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండలం లోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మల్కపల్లి, రేగులగూడెం, దేవాపూ ర్‌ ఆశ్రమ పాఠశాలలను ప్రభుత్వ జూనియర్‌ కళాశాల తెలంగాణ మోడల్‌ స్కూల్‌, కస్తూర్భా గాందీ పాఠశాలలను ఆయన ఆక స్మికంగా తనిఖీ చేశారు.

ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థుల గైర్హాజరుపై కలెక్టర్‌ అసహనం

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కాసిపేట, జూలై24 (ఆంఽధ్రజ్యోతి): గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండలం లోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మల్కపల్లి, రేగులగూడెం, దేవాపూ ర్‌ ఆశ్రమ పాఠశాలలను ప్రభుత్వ జూనియర్‌ కళాశాల తెలంగాణ మోడల్‌ స్కూల్‌, కస్తూర్భా గాందీ పాఠశాలలను ఆయన ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల ప రిశుభ్రత వ్యక్తిగత శుభ్రతపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కార ్యక్రమాలు నిర్వహించాలన్నారు. జ్వరపీడిత గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాధుల నియంత్రణపట్ల అవగాహ న పెంచాలన్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాలలతో పాటు మోడల్‌ కాలేజీ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, కేజీబీవీల్లోని భోజన నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పాఠశాలల్లో అడ్మిషన్లు తక్కువ గా ఉండడం, విద్యార్థుల గైర్హాజరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరుశాతం పెంచే విధంగా చర్యలు చేపట్టాల న్నారు. మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులకు పాఠాలు బోధించారు. హాస్టల్‌ లో కిచెన్‌సెడ్‌ లేక ఇబ్బంది పడుతున్నామని వంట సిబ్బంది కలెక్టర్‌ దృష్టికి తీసుకు రాగా షెడ్డు మంజూరు చేశారు. కేజీబీవీలో విద్యార్థుల సంఖ్యకు అను గుణంగా టాయిలెట్లు లేకపోవడంతో అవస్థలు పడుతు న్నామని విద్యార్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకరాగా అదనంగా టాయిలెట్ల నిర్మాణాలను మంజూరు చేశారు. విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యంగా వ్య వహరించిన శాఖ పరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో పురుషోత్తం నాయక్‌ మండల ప్రత్యేకాధికారి, ఆశ్రమ పాఠశాలల ప్రత్యేకాధికారి రాజేశ్వరి, ఎండీపీవో సత్యనారాయణ సింగ్‌, ఎంపీవో సప్తర్‌ అలీ పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 12:20 AM