స్థానిక ఎన్నికలకు సన్నద్ధం...
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:06 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి గా సన్నద్ధమైంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో మొదట ఎం పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తరువాత సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నారు.
-ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
-ఓటరు జాబితాకు తుది మెరుగులు
-మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
-సిద్ధంగా ఉండాలంటూ కలెక్టర్లకు సీఎం ఆదేశాలు
-త్వరలో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
మంచిర్యాల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి గా సన్నద్ధమైంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో మొదట ఎం పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తరువాత సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ త్వరలో షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి లోక్‌సభ ఎలక్షన్లు ముగియగానే, స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం అయింది. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పా లనపై పట్టు సాధించేందుకు కొంత సమయం పట్టిం ది. గ్రామ పంచాయతీల పాలన గత సంవత్సరం జన వరిలో ముగియగా, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పాలక వర్గాల పదవీకాలం జూలై మాసంతో ముగిసిం ది. దీంతో స్థానిక సంస్థల పాలన ప్రత్యేకాఽధికారుల చే తుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల ని ర్వహణకు ఈసీ సిద్ధంకాగా ఎలక్షన్లకు సంబంధించి కీ లక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పీవోలు, ఏపీవో లు, రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తికాగా, శిక్ష ణ తరగతులు కూడా ముగిశాయి. మరోవైపు ఎన్నికల కు సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ కూడా క లెక్టర్లను ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగం ఆ పనుల్లో నిమగ్నమైంది.
జిల్లాలో 613 గ్రామాలు....
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలోని 613 గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గతంలో మొత్తం 311 గ్రామ పంచాయతీలకు గాను హాజీపూర్ మండలంలోని ఐదు జీపీలను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో జీపీ ల సంఖ్య 306కు తగ్గింది. అయితే జైపూర్ మండలం లోని గోపాల్‌పూర్, కాసిపేట మండలంలోని వరిపేట, జన్నారం మండలంలోని చర్లపల్లి, మొర్రిగూడ గ్రామా లను పంచాయతీలు మార్చాలంటూ ప్రభుత్వానికి అఽధి కారులు ప్రతిపాదనలు పంపారు. ఈ విషయం పెం డింగులో ఉండటంతో ప్రస్తుతం జీపీల సంఖ్య 306కు పరిమితం అయింది. జిల్లాలో రెండు పంచాయతీ డి విజన్లలో 16 మండలాలు ఉన్నాయి. ఎంపీటీసీ స్థానా లు 129 ఉన్నాయి. గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్ కార్పొరేషన్‌లో మూడు స్థానాలు వి లీనం అయ్యాయి. కొత్తగా భీమిని, భీమారం మండలా ల్లో అధనంగా రెండు స్థానాలను పెంచగా, మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్యకు 129కి చేరింది. అలాగే జ డ్పీటీసీ స్థానాలు 16, ఎంపీపీ స్థానాలు 16 ఉన్నాయి. వీటికిగాను తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ని ర్వహించనుండగా, అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇ తర సామగ్రి జిల్లాకు ఇప్పటికే చేరింది. ఎంపీటీసీ ఎ న్నికల కోసం గులాబీ, జడ్పీటీసీ పోలింగ్ కోసం తెలు పు రంగు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్నారు.
ఒక అభ్యర్థికి ఒకే నామినేషన్...
ఇంతకు పూర్వం ఒక అభ్యర్థి అనేక పదవుల కోసం పోటీపడే అవకాశం ఉండేది. ఇప్పుడు ఒక అభ్యర్థి ఒక్క పదవికే పోటీ చేయాలనే నిబంధనను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో ఒక అభ్యర్థి ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పోటీచేసే అ వకాశం ఈసారి ఉండే అవకాశాలు లేవు. రాష్ట్రంలో రిజిర్వేషన్ల అంశం ఇంకా తేలకపోయినా, ఎన్నికలు ఎ ప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అధికారులు అవసర మైన ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరిలో రూపొందించిన ఓటరు జాబితాకు తుది మెరుగులు పెట్టే పనుల్లో ప్ర స్తుతం పంచాయతీ అధికారులు నిమగ్నమై ఉన్నారు. చనిపోయిన వారి పేర్లను తొలగించి, కొత్తగా నమోదైన ఓటర్లను జాబితాలో చేర్చే పనుల్లో బిజీగా ఉన్నారు. అ యితే ఎన్నికల నాటికి కొత్తగా ఓటరు జాబితాలో న మోదు చేసుకొనే అవకాశం కూడా యువతకు కల్పిం చారు. అలాగే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో నోటా వి ధానానికి ఈసీ శ్రీకారం చుడుతోంది. 2004 నుంచి పా ర్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో అమలు చేస్తు న్న నోటా ఇకమీదట స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అ మలు చేయనున్నారు. ఈ మేరకు బ్యాలెట్ పేపర్లలో నోటాను ముద్రించనున్నారు.
Updated Date - Jul 27 , 2025 | 12:07 AM