ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

HCU students protest: విద్యార్థులపై పోలీసుల తీరు గర్హనీయం

ABN, Publish Date - Apr 01 , 2025 | 05:55 AM

హెచ్‌సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థుల భూముల పరిరక్షణ పోరాటం పై వచ్చే నెల 1న ధర్నా నిర్వహించనున్నట్టు సీపీఎం ప్రకటించింది.

ఖండించిన విద్యార్థి యువజన సంఘాలు

భూముల వేలం నిలిపేయాలి: మానవ హక్కుల వేదిక

నేడు సీపీఎం ఆధ్వర్యంలో యూనివర్శిటీ వద్ద ధర్నా

హైదరాబాద్‌ సిటీ/ పంజాగుట్ట/ రాంనగర్‌/ కేయూ క్యాంపస్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల తీరును రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు ఖండించాయి. పీడీఎ్‌సయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌వీ శ్రీకాంత్‌, పీ నాగరాజు సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేసి, కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో కేయూ క్యాంపస్‌ మొదటి గేట్‌వద్ద, రెండో గేట్‌ వద్ద డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. భూములు కాపాడుకునేందుకు ఆందోళనకు దిగిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం దుర్మార్గం అని ఎస్‌ఎ్‌ఫఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్‌ ఆరోపించారు. హెచ్‌సీయూ భూముల వేలం ప్రక్రియను నిలిపేయాలని మానవ హక్కుల వేదిక హైదరాబాద్‌ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్‌, సంజీవ్‌ డిమాండ్‌ చేశారు. దానికి బదులు ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు శ్రద్ధ వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. విపక్ష నేతగా ఉన్నప్పుడే వర్శిటీ భూములపై కన్నేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలని బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏప్రిల్‌ ఒకటో తేదీన యూనివర్శిటీ ముందు ధర్నా చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ప్రకటించారు.

ప్రభుత్వంపై బురదచల్లేందుకు బీఆర్‌ఎస్‌.. బీజేపీ : టీపీసీసీ

హెచ్‌సీయూ విద్యార్థులను అడ్డం పెట్టుకుని బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రభుత్వంపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ గౌడ్‌ ఓ ప్రకటనలో ఆరోపించారు. వాస్తవంగా ఆ 400 ఎకరాల భూమి హెచ్‌సీయూది కాదని ప్రభుత్వానిదని తెలిపారు.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 05:55 AM