kumaram bheem asifabad- కవితల సారు..కథల మాస్టారు..
ABN, Publish Date - Jun 29 , 2025 | 10:41 PM
ఆయన ఓ సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడే కాదు విలక్షణ బోధకుడు, విశిష్ట ప్రేరకుడు, సాహిత్యం, కళలు, సేవ, దార్మికత దార్శనికత, సభా వ్యాఖ్యానం ఆయన సొం తం. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత జిల్లా కేంద్రంలోని జన్కా పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్లోపాధ్యా యుడు ధర్మపురి వెంకటశ్వర్లు అక్షర ఆదర్శానికి జ్యోతి రూపమిది.
- రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు
ఆసిఫాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఆయన ఓ సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడే కాదు విలక్షణ బోధకుడు, విశిష్ట ప్రేరకుడు, సాహిత్యం, కళలు, సేవ, దార్మికత దార్శనికత, సభా వ్యాఖ్యానం ఆయన సొం తం. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత జిల్లా కేంద్రంలోని జన్కా పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్లోపాధ్యా యుడు ధర్మపురి వెంకటశ్వర్లు అక్షర ఆదర్శానికి జ్యోతి రూపమిది.
- విద్యార్థులను తీర్చిదిద్దేందుకు..
విద్యార్థులను ఆంగ్ల భాషలో తీర్చిదిద్దేందుకు ఎల్లవే ళలా కృషి చేస్తున్నారు ధర్మపురి వెంకటేశ్వర్లు. ఇందు కోసం తన పని చేస్తున్న జన్కాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో స్వయంగా డిజిటల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్‌నే ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న కేయాన్ ప్రాజెక్టర్, తన సమకూర్చుకున్న కంప్యూటర్, సాంకేతిక పరికరాలతో విద్యార్థులు ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు స్వీయానుభవాలతో నేర్చుకోనేలా ప్రేరేపిస్తు న్నారు. ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్‌ను సాధన చేయిస్తు న్నారు. ఇదే ల్యాబ్‌లో 350కి పైగా ఇంగ్లీష్ నీతి ప్రేరణ కథల పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. తన మార్గదర్శనంలో విద్యార్థులచే ఆంగ్లంలో రాయించిన కథలతో ప్రత్యేకంగా ‘యంగ్ మైండ్స్ టైమ్ లెస్’ శీర్షికతో పుస్తకాన్ని ముద్రించడాన్ని కలెక్టర్ సైతం అభి నందించారు. రూమ్ టు రీడ్ సంస్థ వారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూపొందించిన క్లౌడ్ స్టోరేజ్ ఇంగ్లీష్ స్టోరీలను ఈ పాఠశాలలోని ఇంటరాక్టీవ్ ప్లాట్ ప్యాల్(ఐఎఫ్‌పీ) స్ర్కీన్‌పై రాష్ట్రంలోనే తొలిసారి ఉపయోగించి వెంకటేశ్వర్లు ప్రశంసలంద ుకున్నారు.
- ఆన్‌లైన్ వేదికగా..
కొవిడ్ కష్టకాలంలో బడి చదువులకు దూరమైన విద్యార్థులకు ఆన్‌లైన్ జూమ్ వేదిక ద్వారా విషయ బోధనలతో పాటు ప్రేరణ తరగతులను ప్రారంభిం చారు. యంగ్ మైండ్స్, మాస్టర్ మైండ్స్ పేరున ఈ క్లాస్‌లను ఇప్పటికీ కొనసాగించడం విశేషం. జిల్లాలోని మారు మూల ప్రాంతాల విద్యార్థులకు జిల్లా సైన్స్ అధికారి మధుకర్ సమన్వయంతో మాస్టమైం డ్స్ పేరున గూగుల్ మీట్ ద్వారా 2020-21 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నా రు. జిల్లా మాస్టర్ మైండ్స్ ఫలితాన్ని తెలుపుతూ వెంకటేశ్వర్లు ఆంగ్లంలో రాసిన విజయగాథను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ, జాతీయ స్కూల్ లీడర్ షిప్ అకాడమీ వారు 2023-24 జర్నల్‌లో ప్రచు రిం చడం హర్షిందగిన విషయం.
- బడి బాగుకు బాధ్యతగా..
తను ఏ పాఠశాలలో పని చేసినా ఆ పాఠశాలలో కనీస వసతుల కల్పనకు సమాజం, ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో చేస్తున్న కృషి కొనియాడదగినది. ఎంపీయూపీఎస్ బజార్‌వాడలో పోషకుల సహకా రంతో నాలుగు తరగతులకు సరిపడే రేకుల షెడ్లు నిర్మాణం, బూర్గుడ జడ్పీ పాఠశాల భవన నిర్మాణం, ఆట స్థలం కోసం గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల సహ కారంతో విలువైన ఎకరం స్థల సేకరణ, జన్కాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల కోసం ప్రజాప్రతినిధుల సహకారంతో అత్యంత విలువైన సుమారు ఎకరం ఆట స్థలం సమీకరణ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు కృషికి తార్కానాలు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగ తుల సమయంలో అల్పాహారం, స్టడీ మెటీరియల్, నోటు పుస్తకాలను స్వయంగా పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. పాఠశాలలో ఈయన సేవను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2011 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థా యి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును అందజేసింది.
- రచయిత, సాహితీ ప్రముఖుడు..
ఆంగ్ల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలుగు భాష లోనూ ప్రావీణ్యులు, ఆసిఫాబాద్ కవుల సంఘం గౌరవ సలహాదారులుగా హైదరాబాద్ దర్పణం సాహితీ వేదిక సమీక్షకుడిగా కొనసాగుతున్నారు. పలు పుస్లకాల్లో వీరి రచనలు ప్రచురణకు నోచుకున్నాయి. పత్రికల్లో విజయగాథలు రాస్తున్నారు. మూడు శత కాలు, ఓ కవితా సంపుటి రాశారు. ఇటవలే రవీంద్ర భారతిలో ఆవిష్కరించిన ఈయన వసుధా శతకం పుస్తకం సాహితీ ప్రముఖులు అవధానుల మెప్పు పొందింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో స్థానం పదిల పరుచుకుంది. పద్యకవిగా ప్రపంచ తెలుగు మహాసభ ల్లోనూ ఉత్తమ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ గోదావరి సాహితీ నంది పుస్కారం స్వీకరిం చారు.
- కళాకారుడు, వ్యాఖ్యాత..
వెంకటేశ్వర్లు కళాకారుడు, వ్యాఖ్యాతగాను జిల్లా ప్ర జలకు సుపరిచితుడు. జిల్లాలో ప్రతిష్ఠాత్మక నవజ్యోతి సాంస్కృతిక సంస్థకు దశాబ్దాల కాలంగా అధ్యక్షుడిగా కొనసాగుతు న్నారు. ఈ వేదిక ద్వారా సాహితీ, సాం స్కృతిక కార్యక్రమాలను నిర్వహిసు న్నారు. స్వయా నా తబలా, ప్యాడ్ వాయిద్యకారుడైన వెంకటేశ్వర్లు ఔత్సాహి క కళాకారులకు శిక్షణ సైతం అందిస్తున్నారు.
Updated Date - Jun 29 , 2025 | 10:41 PM