ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad-మొక్కలు నాటి సంరక్షించాలి

ABN, Publish Date - Jul 08 , 2025 | 10:46 PM

హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌ అన్నారు. మార్కెట్‌ కమిటీ యార్డు ఆవరణంలో మంగళవారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి సుమారు ఐదు వందల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు..

మొక్కలు నాటుతున్న చైర్మన్‌ విశ్వనాథ్‌, అధికారులు

జైనూర్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌ అన్నారు. మార్కెట్‌ కమిటీ యార్డు ఆవరణంలో మంగళవారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి సుమారు ఐదు వందల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకు పచ్చ తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ ముకీద్‌, మాజీ వైస్‌ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్‌ , సీనియర్‌ నాయకులు మేస్రాం అంబాజీ, నాయకులు రాథోడ్‌ రాందాస్‌ వసీం, ఆత్రం దత్తు, గేడాం గోపిచంద్‌, కోటేష్‌, పంద్ర షేకు, కనక గంగారాం, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎంపీవో మోహన్‌, ఈవో కోరేంగ ఆనంద్‌రావ్‌, ఏపీవో నగేష్‌, టీఎలు రాజలింగు, సురెందర్‌రెడ్డి, ఆత్మరాం, ఎఫ్‌ఎ ఆత్రం రవిందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటి సంరక్షించాలని డీఆర్‌డీఏ దత్తారావు అన్నారు. మండలంలోని హట్టి ఆశ్రమ పాఠశాల ఆవరణలో మంగళవారం వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి వాటి సంరక్షణలో బాధ్యత చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 200 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అంజద్‌పాషా, ఎంఈవో ప్రకాష్‌, ఏపీవో మల్లయ్య, ఏపీఎం జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): చెట్లతోనే మానవ మనుగడ అని ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బాబాపూర్‌ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 10:46 PM