ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yadagirigutta: గుట్ట ప్రధాన కూడళ్లలో దేవుళ్ల విగ్రహాలు

ABN, Publish Date - Jun 13 , 2025 | 04:28 AM

యాదగిరిగుట్ట ప్రధాన కూడళ్లలో దేవుళ్ల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ కమిషనర్‌, ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.

  • ఘాట్‌ రోడ్డు ఇరువైపుల సూచిక బోర్డులు

  • ఫిర్యాదులకు అందుబాటులో పెట్టె: ఈవో వెంకట్రావు

యాదగిరిగుట్ట, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట ప్రధాన కూడళ్లలో దేవుళ్ల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ కమిషనర్‌, ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. యాదగిరికొండపై ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈవో మాట్లాడారు. నిత్యం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రసాద వితరణ చేస్తామని తెలిపారు. భక్తుల కోసం ఘాట్‌ రోడ్డు వెంట రెండువైపులా సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల సలహాలు, సూచనల కోసం ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహచార్యులు పాల్గొన్నారు.

43రోజుల్లో రూ.4.47కోట్ల హుండీ ఆదాయం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు ఏప్రిల్‌ 30నుంచి ఈ నెల 11 వరకు 43రోజుల్లో రూ.4.47కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. హుండీల్లో కానుకలను గురువారం లెక్కించారు. 115 గ్రాము ల మిశ్రమ బంగారం, 6.50కిలోల మిశ్రమ వెండి కూడా సమకూరింది.

Updated Date - Jun 13 , 2025 | 04:28 AM