పెంపుడు జంతువులపై జాగ్రత్తలు తీసుకోవాలి
ABN, Publish Date - Jul 06 , 2025 | 11:28 PM
పెంపుడు జంతు వుల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల పెంపకందారులు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : పెంపుడు జంతు వుల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల పెంపకందారులు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం ప్ర పంచ జునోసిస్‌డేను పురస్కరిం చుకుని నాగర్‌కర్నూల్ పశు సంవ ర్ధక శాఖ అధికారి కార్యాలయంలో రేబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్ర మాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పెంపుడు జం తు వులకు టీకాలు వేయించాలని సూచించారు. చాలా మందికి పెంపుడు జంతువులపై అమిత మైన ప్రేమ ఉంటుందని, ఆ జంతువుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే అవి ప్రాణాంత క వ్యాధులకు కారణమవుతాయని అన్నారు. జునోసిస్ వ్యాధులు జంతువుల నుండి మను షులకు సంక్రమించే వ్యాధులు వీటిలో రేబిస్, బర్డ్‌ఫ్లూ, స్వైన్‌ఫ్లూ వంటివి ఉన్నాయని తెలిపా రు. పశు సంవర్ధక శాఖ అధికారి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. జిల్లా పశు సంవ ర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.జ్ఞాన శేఖర్, వైద్యా రోగ్య శాఖ ఇమ్యునైజేషన్ అధికారి రవి నా యక్, పశుసంవర్ధక, వైద్యారోగ్య శాఖల అధి కారులు, సిబ్బంది, జంతువుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 06 , 2025 | 11:28 PM