ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నెమలి, జింక మాంసం విక్రేత అరెస్ట్‌

ABN, Publish Date - Jul 09 , 2025 | 12:58 AM

నెమలి, జింక మాంసం విక్రేతను నల్లగొండజిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్‌చేశారు.

కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాజశేఖర్‌రాజు

మిర్యాలగూడ అర్బన్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): నెమలి, జింక మాంసం విక్రేతను నల్లగొండజిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్‌చేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు మంగ ళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నిమ్మల రమేష్‌ వృత్తిలో భాగంగా కూలి పనులకు వెళ్లడంతోపాటు చేపలు, కుందేళ్లు, అడవి పందుల వేటకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఎక్కువ ఆదాయాన్ని పొందాలనే ఆలోచనతో కొన్ని రోజులుగా అడవి పందులు, నెమళ్లను వేటాడంతోపాటు తనకు పరిచయం ఉన్న రాజు అనే వ్యక్తి నుంచి జింక, దుప్పి మాంసాన్ని కూడా తీసుకొని వచ్చి తన ఇంట్లో విక్రయిస్తున్నాడని ఈ ఏడాది మార్చి 23వ తేదీన పోలీసులకు సమాచారం అందింది. దీంతో వేములపల్లి ఎస్‌ఐ తన సిబ్బందితో వెళ్లి దాడి చేయగా నిందితుడు రమేష్‌ పారిపోయాడు. రమేష్‌పై పోలీసులు వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మంగళవారం నిందితుడు రమేష్‌ను అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. రెండు ఎయిర్‌ రైఫిల్స్‌, మాంసం కోసేందుకు ఉపయోగించే మూడు కత్తులు, అడవి పందుల వేటకు సంబంధించిన ఐదు వలలు, కుందేళ్ల వేటకు సంబంధించిన 15 ఉచ్చులను స్వాదీనం చేసుకున్నారు. సమావేశంలో మిర్యాలగూడ రూరల్‌ పీఎన్‌డీ. ప్రసాద్‌, వేములపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:58 AM