Pawan Kalyan: జవాన్ కుటుంబానికి రూ.25 లక్షల సాయం
ABN, Publish Date - Jun 15 , 2025 | 05:54 AM
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన అగ్నివీర్ సైనికుడు మురళీనాయక్ కుటుంబానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
మాట నిలుపుకొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్
హిందూపురం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన అగ్నివీర్ సైనికుడు మురళీనాయక్ కుటుంబానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీనాయక్ ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొని కశ్మీర్‌లో మే 9న వీరమరణం పొందారు. 11న అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్.. ఆ కుటుంబానికి రూ.25 లక్షల సాయం ప్ర కటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును జనసేన తిరుపతి, పాలకొండ ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, జయకృష్ణ శనివారం జవాన్ కుటుంబానికి అందజేశారు.
Updated Date - Jun 15 , 2025 | 05:54 AM