పంచాయతీలే నయం...!
ABN, Publish Date - Apr 28 , 2025 | 11:15 PM
ఆస్తిపన్ను వసూళ్లలో గ్రామ పంచాయతీలు ముందంజలో నిలిచా యి. మున్సిపాలిటీలతో పోల్చితే పంచాయతీలు దాదాపు గా లక్ష్యానికి చేరువలో ఉన్నాయి.
ఆస్తిపన్ను వసూళ్లలో పల్లెల హవా
-మార్చి నెలాఖరుతో ముగిసిన గడువు
-అట్టడుగు స్థానంలో బెల్లంపల్లి బల్దియా
-గ్రామ పంచాయతీల్లో 90.80 శాతం వసూళ్లు
-మున్సిపాలిటీల్లో 70.34 శాతానికి పరిమితం
మంచిర్యాల, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఆస్తిపన్ను వసూళ్లలో గ్రామ పంచాయతీలు ముందంజలో నిలిచా యి. మున్సిపాలిటీలతో పోల్చితే పంచాయతీలు దాదాపు గా లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు మరో ఐదు మున్సిపాలి టీలు, 16 మండలాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి నెలాఖరు వరకు మున్సిపాలిటీల్లో 70.34 శాతం వసూళ్లు నమోదుకాగా గ్రామ పంచాయ తీల్లో 90.80 శాతం వసూళ్లు నమోదయ్యాయి. మున్సి పాలిటీలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో మొ త్తం రూ. 41 కోట్ల 12 లక్షల ఆస్తిపన్ను డిమాండ్ ఉం డగా, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆస్తిపన్ను మొత్తం డిమాండ్ రూ. 6,71,28,274 ఉంది.
డివిజన్ల వారీగా పన్ను వసూళ్లు...
జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో మొత్తం 16 మండలాల్లో 306 గ్రామ పంచా యతీలు ఉన్నాయి. బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని గ్రా మ పంచాయతీల్లో మొత్తం డిమాండ్ రూ. 2 కోట్ల 42 లక్షల 59,635 ఉండగా అందులో గడువు ముగిసే నా టికి రూ. 2,22,36,930 వసూలైంది. మరో రూ. 20 లక్ష ల 22,705 వసూలు కావాల్సి ఉంది. అలాగే మంచిర్యాల డివిజన్ పరిధిలో రూ. 3,93,85,910 డిమాండ్ ఉండగా అందులో రూ. 3,58,52,105 వసూలైంది. మరో రూ. 35,33,805 వసూలు కావాల్సి ఉంది.
మండలాల వారీగా ఇలా...
మండలం డిమాండ్ వసూలు శాతం
జైపూర్ 51,57,484 48,08,339 96
కన్నెపల్లి 10,24,373 9,79,489 96
భీమారం 15,00,355 14,16,728 94
కోటపల్లి 32,48,441 30,47,888 94
లక్షెట్టిపేట 41,17,278 38,61,722 94
భీమిని 10,36,025 9,64,667 93
హాజీపూర్ 44,60,623 41,26,420 93
కాసిపేట 75,02,675 69,41,660 93
బెల్లంపల్లి 45,73,661 41,72,933 91
దండేపల్లి 64,82,932 59,12,348 91
నెన్నెల 16,33,790 14,92,036 91
వేమనపల్లి 8,86,435 8,10,745 91
చెన్నూరు 41,83,659 37,62,888 90
మందమర్రి 32,25,033 28,63,680 89
తాండూరు 76,60,370 68,75,400 87
జన్నారం 1,02,35,140 87,93,050 86
మున్సిపాలిటీల్లో ఇలా...
మున్సిపాలిటీ గృహాలు డిమాండ్ వసూ లు శాతం
మంచిర్యాల 45,372 26.28 కోట్లు 17.01 65.03
చెన్నూరు 72,37 2.85 1.74 61.05
మందమర్రి 13,680 2.29 1.76 76.86
క్యాతన్‌పల్లి 12,159 3.94 3.00 76.14
బెల్లంపల్లి 16,246 4.16 2.34 56.25
లక్షెట్టిపేట 5988 1.06 1.45 86.31
చివరి స్థానంలో బెల్లంపల్లి...
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బెల్లంపల్లి మున్సిపాలిటీ ఆస్తిపన్ను వసూళ్లలో చివరి స్థానంలో సరిపెట్టుకుంది. ఆస్తి పన్ను వసూళ్లపై సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా డిమాండ్ మేరకు పన్ను వసూలు కాలేదని తెలుస్తోంది. పాలక వర్గం లేని మందమర్రి మున్సిపాలిటీ పన్ను వసూళ్లలో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. గతంలో ప్రతి సంవత్సరం మార్చి మాసానికి రెండు నెలల ముందుగానే మున్సిపాలిటీల నుంచి ప్రజలకు ఆస్తిపన్ను డిమాండ్ నోటీసులు జారీ అయ్యేవి. వాహనాల ద్వారా పన్ను వసూళ్లకు వసూళ్లకు విస్తృత ప్రచారం చేసేవారు. ప్రస్తుతం ఎక్కడ కూడా నోటీసులు జారీకాకపోగా, ప్రచారం నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపాలిటీ వెనుకబడినట్లు ప్రచారం జరగుతోంది. మున్సిపల్ సిబ్బంది రశీదు పుస్తకాలు ఇంటింటికి తిరుగుతూ బిల్లులు చెల్లించాలని కోరుతుండగా, ఏ ఇంటికి ఎంత పన్ను వేశారో యజమానులకు తెలియకపోవడం విచిత్రంగా ఉంది. ప్రభుత్వం ఓ వైపు ఆస్తిపన్ను చెల్లించాలని చెబుతున్నా మున్సిపాలిటీలు డిమాండ్ నోటీసులు జారీ చేయకపోవడంతో ఈ సంవత్సరం వసూళ్ల లక్ష్యం నెరవేరలేదు. అయితే మొండి బకాయిదారులకు మాత్రం మున్సిపాలిటీలు రెడ్ నోటీసులు జారీ చేసి, కఠినంగా వ్యవహరించడంతో కొంతమేర వసూళ్లు పెరిగాయి.
Updated Date - Apr 28 , 2025 | 11:15 PM