ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరుబయటే ఓపీ సేవలు

ABN, Publish Date - May 20 , 2025 | 12:45 AM

నిడమనూ రు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం(పీహెచ్‌సీ) విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి దహనమైంది.

నిడమనూరు పీహెచ్‌సీలో చెట్ల కింద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

ఆరుబయటే ఓపీ సేవలు

విద్యుదాఘాతంతో భవనం దగ్ధం

చెట్ల కిందే వైద్యం

నూతన భవనం పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు

నిడమనూరు పీహెచ్‌సీలో పరిస్థితి

నిడమనూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): నిడమనూ రు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం(పీహెచ్‌సీ) విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి దహనమైంది. దీంతో సిబ్బంది సోమవారం ఆస్పత్రి ఆవరణలో చెట్ల కింద విధులు నిర్వహించారు. ఆరుబయటే రోగులకు ఓపీ సేవలు అందిస్తున్నారు. పీహెచ్‌సీ పాతభవనం కావడంతో శిథిలావస్థకు చేరింది. పైక ప్పు పెచ్చులు తరచుగా ఊడిపడుతూ ప్రమాదానికి నిలయంగా మారింది. శ్లాబు లీకేజీ కావడంతో వర్షా లు కురిస్తే నీరు లోపలికి వచ్చేది. దీనికితోడు శిథిల భవనం కావడంతో విద్యుత్‌ వైర్లు, బోర్డులు, పైపులు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. దీంతో కొన్ని గదుల్లో కరెంటు సరఫరా ఉండగా, మరికొన్ని గదు ల్లో సరఫరా అయ్యేది కాదు. అయినా వైద్యులు, సిబ్బంది ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఉంది. పక్కనే నిర్మిస్తున్న నూతన భవనం ఏడాది క్రితం పూర్తి చేసి పీహెచసీకి అప్పగించాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో పూర్తి కాలేదు. దీంతో శిథిల భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమం లో పీహెచ్‌సీలోని స్టోర్‌రూంలో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 24 గంటల ఆస్పత్రి కావడంతో స్టాఫ్‌నర్స్‌ సహ కొందరు సిబ్బంది, నైట్‌ వాచ్‌మన కూడా అందులోనే నిద్రిస్తున్నారు. మంటలు కమ్ముకోవడంతో గమనించి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. స్టోర్‌రూంలో మొదలైన మంటలు ఆస్పత్రి అంతటా వ్యాపించడంతో భవనం దగ్ధమైంది. పీహెచ్‌లోని మందులు, రికార్డులు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నీచర్‌, బెడ్లు, ఫ్రిజ్‌లు, ఐఎల్‌ఆర్‌ రిఫ్రిజిరేటర్లు, సీబీపీ మిషన్‌ తదితర వస్తు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. భవనం దగ్ధమైనా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుదాఘాతం కారణంగా భవనం దగ్ధం కావడంతో పాటు పైకప్పు పెచ్చులు కూడా పెద్ద ఎత్తున ఊడిపడ్డాయి.

దీంతో పీహెచ్‌సీలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణలో చెట్టు కింద విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులుగా చెట్ల కిందే విధులు నిర్వహిస్తూ రోగులకు మందులు అందిస్తున్నారు. కొత్త భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భవనం పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున పీహెచ్‌సీకి ఎదురుగా ఉన్న బాలికల హాస్టల్‌లో తాత్కాలికంగా వైద్య సేవలు అందించేందుకు అనుమతి కోరారు.

ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు

పీహెచ్‌సీలో అగ్ని ప్రమాదం జరగడంతో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఓపీ సేవలకు ఎలాంటి సమస్య లేదు. కొత్త భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించాం. ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలికల వసతిగృహంలో తాత్కాలికంగా ఆరోగ్య సేవలు అందించేందుకు సంబంధిత అధికారుల అనుమతి కోరడం జరిగింది.

- డాక్టర్‌ అరవింద్‌, వైద్యాధికారి.

Updated Date - May 20 , 2025 | 12:45 AM