ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక రెండు రోజులే!

ABN, Publish Date - Jun 29 , 2025 | 12:37 AM

ఆస్తిప న్ను రెండో అర్థ వార్షిక విడత చెల్లింపునకు మిగిలింది ఇక రెండు రోజలే. ఈ నెల 30వ తేదీలో గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఎలాంటి అపరాధ రుసు ము ఉండదు.

ఇక రెండు రోజులే!

ఆస్తి పన్ను చెల్లింపుల గడువు

గడువు దాటితే నూటికి రూ. 2 చొప్పున అపరాధ రుసుము

చెల్లింపులకు ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు

ఇంటింటికి డిమాండ్‌ నోటీసులు

రూ.10వే లకు పైగా ఉన్న బకాయిదారులకు రెడ్‌ నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు

రామగిరి, జూన 28 (ఆంధ్రజ్యోతి): ఆస్తిప న్ను రెండో అర్థ వార్షిక విడత చెల్లింపునకు మిగిలింది ఇక రెండు రోజలే. ఈ నెల 30వ తేదీలో గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఎలాంటి అపరాధ రుసు ము ఉండదు. ఈ గడువు దాటిన తర్వాత ఆస్తి పన్ను చెల్లించే వారికి నూటికి రూ.2 వడ్డీ చొప్పు న అపరాధ రుసుముతో చెల్లించాల్సిందే. మున్సిపాలిటీల్లో సంవత్సరంలో రెండు విడతలుగా ఆ స్తిపన్ను చెల్లించాల్సి ఉంటుంది.మొదటి అర్థ వా ర్షిక ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు నెలలకు సంబంధించిన ఆస్తిపన్ను జూన మాసంలో చెల్లించాల్సి ఉంటుంది. రెండవ అర్థ వార్షికం అక్టోబరు నుం చి మార్చి నెలలకు సంబంధించిన ఆస్తిపన్ను ఫి బ్రవరి మాసంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ ఏడాదికి రెండుసార్లు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలన్న ఆలోచనలోనే ఉన్నారు. వా స్తవానికి ప్రతీ అర్థవార్షికానికి సంబంధించిన చె ల్లింపులు ఎప్పటికప్పుడు చేస్తే అపరాధ రుసు ము పడదు. మొదటి అర్థవార్షికానికి సంబంధించిన ఆస్తిపన్ను సకాలంలో చెల్లించకపోతే రెండో అర్థ వార్షికంలో రూ.2 చొప్పున వడ్డీ అపరాధ రుసుముతో బిల్‌ జనరేట్‌ అవుతుంది. అయితే ఈ రెండో అర్థ వార్షికానికి సంబంధించిన చెల్లిం పు గడువు ఈ నెల 30వ తేదీలోగా ముగియనుంది. అక్టోబరు నుంచి మరుసటి ఏడాది మా ర్చి నాటికి సంబంధించిన ఆరు నెలల ఆస్తి ప న్నును డిసెంబరు నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది.

నల్లగొండలో 43వేల భవనాలు..

నీలగిరి మునిసిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో వాణిజ్య, నివాస భవనాలు కలిపి 43వేల వరకు ఉన్నాయి. సంవత్సరానికి ఆస్తి ప న్ను డిమాండ్‌ రూ.18 కోట్లకు పైగానే ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముందస్తు పన్ను రా యితీలో భాగంగా ఏప్రిల్‌లో ఒక్క నెలలోనే రూ. 7.60 కోట్లు వసూలు చేశారు. మిగిలిన రూ.10 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేస్తున్నప్పటికి ఇప్పు డు అంత సీరియ్‌సగా జరగడం లేదు. ఆస్తి ప న్ను చెల్లించాలని కోరుతూ ఇటీవల మునిసిపల్‌ సిబ్బంది ఇంటింటికీ తిరిగి డిమాండ్‌ నోటీసులు కూడా అందజేశారు. ముందస్తుగా చెల్లించిన వారు పోను 32వేల మందికి డిమాండ్‌ నోటీసులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 21 వేల మందికి డిమాండ్‌ నోటీసులు ఇంటి యాజమానులకు పంపిణీ చేశారు. మిగతా వాటిని వారం, పది రోజుల్లో పంపిణీ చేయనున్నారు. కాగా, భ వన యజమానులు ఎక్కువ మంది మార్చిలో చెల్లించవచ్చనే ఆలోచనలో ఉంటున్నారు. గతంలో ఆనలైన వ్యవస్థ లేని సమయంలో స్థానిక మునిసిపల్‌ సిబ్బంది పన్ను బకాయిపై అపరాధ రుసుం వేయకపోవడంతో ఇప్పుడు కూడా భవన యజమానులు అదే విఽధానం ఉం దనే ఆలోచనలో ఉంటున్నారు. ఆనలైన వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా తేడా రావడానికి వీలు లేదనే విషయాన్ని గ్రహించడం లేదు. ఈ నెల 30వ తేదీలోగా చెల్లించని వారికి జూలై నెలలో మూడు నెలలకు సంబంధించిన ఆస్తి పన్నుపై రూ.100కు రూ.2 చొప్పున వడ్డీ పడనుంది.

ఈ నెలాఖరులోగా చెల్లించాలి

శివరాంరెడ్డి, మునిసిపల్‌ రెవెన్యూ ఆఫీసర్‌

పట్టణ ప్రజలకు తమ ఆస్తి పన్ను ఈ నెలఖారులోగా చెల్లించాలి. మొదటి ఆరు నెలల ఆస్తి పన్నును జూన 30లోగా చెల్లిస్తే ఎలాంటి అపరాధ రుసుం ఉండదు. పట్టణ ప్రజలు దీనిని గమనించి గడువులోగా ఆస్తి పన్ను చెల్లించి మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి.

Updated Date - Jun 29 , 2025 | 12:37 AM