ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చేతులు తడిపితేనే..

ABN, Publish Date - Jul 10 , 2025 | 12:24 AM

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏసీబీ అధికారుల వరుస దాడులు కలకలం సృష్టి స్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని రూపుమా పేందుకు ఏసీబీ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. అయినా నిత్యం ఏదో ఒక చోట అవినీతి అధికారులు ప ట్టుపడుతున్నా ఇతర ఉద్యోగుల్లో మార్పులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

అవినీతికి నిలయాలుగా ప్రభుత్వ కార్యాలయాలు

లంచం ఇవ్వనిదే కదలని ఫైళ్లు

విధిలేని పరిస్థితుల్లో ఏసీబీని ఆశ్రయిస్తున్న బాధితులు

వరుస ఫిర్యాదులతో దూకుడు పెంచిన అధికారులు

మంచిర్యాల, జూలై9 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏసీబీ అధికారుల వరుస దాడులు కలకలం సృష్టి స్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని రూపుమా పేందుకు ఏసీబీ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. అయినా నిత్యం ఏదో ఒక చోట అవినీతి అధికారులు ప ట్టుపడుతున్నా ఇతర ఉద్యోగుల్లో మార్పులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల హోదాను బట్టి నెల నెల లక్షల్లో వేతనాలు అందుకుంటున్న ప్పటికీ లంచాల కోసం అడ్డదారులు తొక్కడం ఆనవాయితీ గా మారింది. ప్రతిపనికి ఓ రేటు నిర్ణయించి మరీ లంచాలు పుచ్చుకుంటున్నారు. ప్రధానంగా రెవెన్యూ మున్సిపల్‌ వైద్యా రోగ్యశాఖ రిజిష్ర్టేషన్లు, సర్వే అండ్‌ భూ రికార్డులు పంచా యతీరాజ్‌ శాఖల్లో ఎంతోకొంత ముట్టచెప్పంది పనులు జ రిగే పరిస్థితి లేదు. దీంతో సహనం కోల్పోతున్న బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఉ మ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఏసీబీ దాడులు ముమ్మ రం కాగా అవినీతి అధికారుల భరతం పడుతున్నారు.

లంచం ఇస్తేనే పనుల్లో కదలిక...

వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారులు లంచం ఇస్తేనే సం బంధిత ఫైళ్లను కదలిస్తున్నారు. లంచం నిరాకరించిన పక్షం లో ఏదోఒక సాకు చూపుతూ ఫైళ్లను వెనక్కి పంపుతున్నా రనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న ప్రజలు నెలల తరబడి తిరిగిన చ క్కదిద్దడం లేదు. ముఖ్యంగా ఆయా శాఖల కిందిస్థాయి అధికారులతో అంటకాగుతున్న జిల్లాశాఖల అధిపతులు లం చాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా కొన్ని చోట్ల నేరుగా కాకుండా కాంట్రాక్టు ఉద్యోగులు, ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దాడులకు వెరవని అధికారులు...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు వరుస దా డులు జరుపుతూ లంచావతారాలను పట్టుకున్నప్పటికీ వివి ధశాఖల ఉద్యోగుల్లో ఎలాంటి బెదురులేకపోవడం గమనా ర్హం. ఓవైపు దాడులు జరుగుతుండగా మరోవైపు అవే కార్యాలయాల్లో లంచాలు తీసుకుంటుండడం గమనర్హం. మరోవైపు ఏసీబీ అధికారుల టార్గెట్‌లో ఉన్న ఉద్యోగులు సైతం ఎలాంటి జంకులేకుండా వసూళ్లకు పాల్పడుతున్నా రనే ఆరోపణలు ఉన్నాయి. బాగా ఆదాయ వనరులు ఉన్న శాఖల్లో ఏసీబీ రైట్స్‌కు కూడా వెరవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు, రెవెన్యూ డిపా ర్ట్‌మెంట్‌, పంచాయతీరాజ్‌శాఖల్లో ఈ వ్యవహారం మరింత గా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులకు పట్టు బడ్డ సరే లక్షల్లో లంచాలు తీసుకనేందుకు కూడ వెనుకాడ డం లేదని ప్రచారం జరుగుతోంది.

దూకుడు పెంచిన ఏసీబీ...

ఇటీవలి కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. వరుస దాడులతో లంచ గొండి అధికారుల భరతం పడుతున్నారు. మూడు నెలల కాలంలో ఆరుచోట్ల దాడులు జరుగడమే దీనికి నిదర్శనం. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఏసీబీ అధికారు లు అవకాశం చూసుకొని మెరుపుదాడులకు పాల్పడుతున్నారు.

ఏసీబీకి చిక్కిన అవినీతి పరులు...

గత నెలలో మంచిర్యాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ మహిళ అధికారితోపాటు సర్వేయర్‌ అవినీతికి పాల్పడగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలోని సెక్షన్‌ అ కౌంట్‌ ఆఫీసర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌లు కలిసి ఓ కాంట్రా క్టర్‌ వద్ద రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకీ చిక్కా రు. ఉట్నూరు మండలం శ్యాంపూర్‌ పశువైద్యాధికారి రాథోడ్‌ రమేశ్‌ను జనవరి 29న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కిందిస్థాయి ఉద్యోగికి ఎల్‌పీసీ ఇచ్చేందుకు రూ. 15వేలు లం చం తీసుకుంటూ అధికారి పట్టుబడ్డాడు. గత నెల 24న క డెంలో రెవెన్యూ సర్వేయర్‌ ఒకరు రైతు పట్టామార్పిడి కోసం రూ. 7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ నెల 4న మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో ఏసీబీ అ ధికారులు రైడ్‌ చేశారు. ఆ దాడుల్లో మండల డిప్యూటి త హసీల్దార్‌ రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

ఎవరికి లంచం ఇవ్వవద్దు...

జి. మధు, ఏసీబీ డీఎస్‌పీ ఆదిలాబాద్‌

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి లంచం ఇవ్వవాల్సిన అవ సరం లేదు. ఎవరైన లంచం డిమాండ్‌ చేసే ఏసీబీ అధికా రులకు సమాచారం ఇవ్వాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ టోల్‌ఫ్రీనంబర్‌ 1064 బోర్డులను ఏర్పాటు చేసాము. అలాగే 9154388963 నంబర్‌లో ఏసీబీ డీఎస్‌పీని కూడ సం ప్రదించవచ్చు. బాధితులు నిర్భయంగా ఏసీబీని ఆశ్రయిస్తే న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటాం. బాధి తుల వివరాలను గోప్యంగా ఉంచుతాం.

Updated Date - Jul 10 , 2025 | 12:25 AM