Online Games: ఆన్‌లైన్ గేమ్స్‌కు ఆటో డ్రైవర్ బలి
ABN, Publish Date - Feb 16 , 2025 | 04:57 AM
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయిన ఓ ఆటో డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
రూ.50 లక్షల అప్పు చెల్లించలేక ఆత్మహత్య
పెద్దపల్లి జిల్లాలో ఘటన
యైుటింక్లయిన్‌కాలనీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయిన ఓ ఆటో డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. యైుటింక్లయిన్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ చొప్పరి దేవేందర్ ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారాడు. కొన్నేళ్ళుగా ఆడుతూ సుమారు రూ.50 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకోవడం, అప్పులు చెల్లించే మార్గం లేక శుక్రవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు కిందకు దించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే దేవేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దేవేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 04:57 AM