ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- విచారణ వేగవంతం చేయాలి

ABN, Publish Date - Jun 19 , 2025 | 10:42 PM

పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో పోలీసుల అధికారులతో గురువారం నెలవారీ నేర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేస్తున్న జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

ఆసిఫాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో పోలీసుల అధికారులతో గురువారం నెలవారీ నేర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులలో త్వరిగతిన ఇన్విస్టిగేషన్‌ పూర్తి చేయడంతో పాటు బాధితులకు త్వరిగతిన పరిహారం వచ్చేలా చూడాలని అన్నారు. పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ వాహనాలతో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా హాట్‌స్పాట్స్‌ను గుర్తించి గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. ప్రాపర్టీ కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తు రికవరీ చేసి బాధితులకు త్వరిగతిన అందేలా చూడాలన్నారు. వర్షాకాలం లో వరదలు సంభవించినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పని చేయాలని సూచించారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాలీబాల్‌ పోటీలు నిర్వహించానలి తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు రామానుజం, విష్ణుమూర్తి, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం

ఆసిఫాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. గురువారం సిర్పూర్‌(యూ) మండలానికి చెందిన కానిస్టేబుల్‌ మడావి ఆనంద్‌కుమార్‌ కాగజ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ గుండె పోటుతో మృతి చెందడంతో అతని భార్య గంగామణికి భద్రత ఎక్స్‌గ్రేషియా కింద రూ.8 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మరణించిన కానిస్టేబుల్‌ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబానికి పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అంజేసే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. పోలీసు సిబ్బంది, కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనర్చడంతో పాటు వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాణాప్రతాప్‌, పోలీసు సంఘం అధ్యక్షుడు విజయశంకర్‌రెడ్డి, ఆర్‌ఐ పెద్దన్న, కార్యాలయ ఏఓ శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ ఖలీల్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 10:42 PM