వెలిమినేడులో నైట్‌హాల్ట్ బస్సు ప్రారంభం
ABN, Publish Date - May 15 , 2025 | 11:59 PM
ప్రజలకు రవాణా సౌకర్యార్థం వెలిమినేడుకు నైట్‌హాల్ట్ బస్సును ప్రా రంభించినట్లు భువనగిరి ఎంపీ చా మల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వే ముల వీరేశం అన్నారు.
వెలిమినేడులో నైట్‌హాల్ట్ బస్సు ప్రారంభం
ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాలరూరల్, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు రవాణా సౌకర్యార్థం వెలిమినేడుకు నైట్‌హాల్ట్ బస్సును ప్రా రంభించినట్లు భువనగిరి ఎంపీ చా మల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వే ముల వీరేశం అన్నారు. చిట్యాల మం డలం వెలిమినేడు- దిల్‌సుఖ్‌నగ ర్ నైట్‌హాల్ట్ బస్సును గురువారం ఎంపీ, ఎమ్మెల్మేలు జెండా ఊపి ప్రారంభించారు. ఇరువురు స్థానిక నాయకులు బస్సు ఎక్కి టికెట్ తీసుకొని గ్రామపంచాయతీ నుంచి జడ్పీహెచఎ్‌స వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎ మ్మెల్యే వీరేశం మాట్లాడుతూ గతంలో వెలిమినేడు నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు నైట్‌హాల్ట్ బస్సు ఉండేదని దానిని పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరినట్లు తెలిపారు. వెలిమినేడుకు నైట్‌హాల్ట్ బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే చౌటుప్పల్‌తో పాటు హైదరాబాద్ వెళ్లేందుకు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, బస్సు సౌక ర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిసి చర్చించినట్లు తెలిపారు. స్పందించిన ఆయన వెలిమినేడుకు నైట్‌హాల్ట్ బస్సును పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించిందని, బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం రేవంత ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దిల్‌సుఖ్‌నగర్ డి పో అసిస్టెంట్ మేనేజర్ సీహెచ. పావని, బుచ్చిరెడ్డి, ఎంవిఎనరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 15 , 2025 | 11:59 PM