ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక కొత్త రేషన్‌ కార్డులు

ABN, Publish Date - Jul 04 , 2025 | 11:37 PM

కొత్త రేషన్‌ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ నెల 14 నుంచి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఆ ఏర్పాట్లలో అఽధి కార యంత్రాంగం నిమగ్నమై ఉంది.

-ఈ నెల 14 నుంచి జారీకీ సన్నాహాలు

-మంత్రి ప్రకటనతో ఏర్పాట్లలో అధికారులు

-జిల్లాలో 26వేల దరఖాస్తులు

మంచిర్యాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్‌ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ నెల 14 నుంచి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఆ ఏర్పాట్లలో అఽధి కార యంత్రాంగం నిమగ్నమై ఉంది. ప్రజాపాలన కా ర్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అయితే 10 నెలలు గడుస్తున్నా అర్హుల జాబితా తయా రీతోనే సరిపెట్టింది. దీంతో జాబితాలో పేర్లున్న లబ్ధిదా రులు కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తు న్నా రు. ప్రభుత్వాలు ఇప్పుడిస్తాం...అప్పుడిస్తాం అంటూ కా లం వెళ్లదీయడమే తప్ప కార్డులు మాత్రం అందజేయ డం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా కుటుం బాలు వేరు పడిన వారితో పాటు కొత్తగా వివాహం చేసుకున్న వారు రేషన్‌ కార్డులు ఎప్పుడెప్పుడు జారీ చే స్తారా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో అమల య్యే చాలా ప్రభుత్వ పథకాలకు రేషన్‌ కార్డు లింక్‌ ఉండటంతో ఆశావహులు వీటి కోసం నిరీక్షిస్తున్నారు.

నాలుగేళ్లుగా సాగదీత ధోరణి...

రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వాలు రేషన్‌ కార్డుల జారీ విషయంలో సాగదీత ధోరణిని అవలంభి స్తున్నాయి. దరఖాస్తులు స్వీకరించడం, ఆ తరువాత వాటిని పక్కన బెట్టడం అలవాటుగా మారింది. రేషన్‌ కార్డుల జారీ విషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బాట లోనే కాంగ్రెస్‌ కూడా పయనిస్తోందన్న విమర్శలు ఉ న్నాయి. ఎప్పటికప్పుడు తేదీలు ప్రకటించడం, తరువా త విస్మరిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దాటవేసే ధోరణిని అవలంభిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. రాష్ట్రంలో 2018 వరకు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ యథావిధిగా కొనసాగింది. ఆ సంవత్స రం డిసెంబర్‌లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేసింది. ఆ త ర్వాత వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో చివరిసా రిగా 2022లో అతికొద్ది మందికి మాత్రమే కొత్త రేషన్‌ కార్డులు అందాయి. ఆ తరువాత సంబంధిత వెబ్‌సైట్‌ ను శాశ్వతంగా మూసివేయడంతో దరఖాస్తులు కుప్ప లు తెప్పలుగా పేరుకుపోయాయి.

సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డుతో లంకె...

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల అమలులో కొన్నింటికి రేషన్‌ కార్డుతో లంకె పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రూ.500 కే సబ్సిడీ వంట గ్యాస్‌, 200 యూనిట్ల వరకు ఉచిత వి ద్యుత్‌, రూ. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ లాం టి పథకాలకు రేషన్‌ కార్డు తప్పనిసరి చేసింది. అలాగే రాజీవ్‌ యువ వికాసం కింద యువతకు రుణాల మం జూరు కోసం కూడా రేషన్‌కార్డును అనుసంధానం చే శారు. ఓ వైపు ఆ పథకాలను అమలు చేస్తున్న ప్ర భుత్వం మరోవైపు రేషన్‌ కార్డులు జారీ చేయక పో వడంతో అనేక మంది అనర్హులుగా మిగిలిపోయారు. చివరకు రైతు రుణమాఫీ కూడా జరుగక ఇబ్బందులు పడ్డారు.

జిల్లాలో 26వేల మంది దరఖాస్తు....

జిల్లాలో రేషన్‌ కార్డుల కోసం 26,116 మంది దర ఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఇప్పటి వరకు 16,669 కార్డులను అధికారులు అప్రోవ్‌ చేయగా, మరో 8600 కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తులో అర్హతలేని 847 కార్డులను అధికారులు తిరస్కరించారు. అయితే ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి పది నెలలు గడు స్తున్నా మూడో వంతు కార్డులను మాత్రమే అధికారు లు అప్రోవల్‌ చేయడం గమనార్హం. తిరస్కరణకు గురికాగా, మిగిలిన ఎనిమిదివేల పై చిలుకు దరఖాస్తు లు మంత్రి ప్రకటించిన గడువులోగా పూర్తవుతాయా...? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నిర్ణీత తేదీలోగా దరఖాస్తుల ప్రక్రియ పూర్తిగాని పక్షంలో మి గిలిన దరఖాస్తుదారుల పరిస్థితి ఏమిటనే ప్రశ్రలు ఉ త్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికా రులు దరఖాస్తు పరిశీలన త్వరితగతిన పూర్తిచేయా లని విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.

Updated Date - Jul 04 , 2025 | 11:37 PM