ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఉపాధి’కి యుక్తధార

ABN, Publish Date - Jul 05 , 2025 | 12:33 AM

ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహా లు చేస్తోంది. సాంకేతికతను జోడించి ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కింద జరుగుతోన్న పనుల న్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఉపాధి కింద చేప ట్టే పనుల్లో ఎలాంటి అవకతవలకు చోటులేకుండా ప్రత్యేకంగా యాప్‌ ను రూపొందించింది.

అవకతవకలు లేకుండా ప్రత్యేకంగా యాప్‌ రూపకల్పన

ఇకనుంచి యుక్తధార యాప్‌లోనే పనులు మంజూరు

కూలీల వివరాలు, ఖర్చులు ఆన్‌లైన్‌లో నమోదు

పైలట్‌ ప్రాజెక్టుగా మండలానికో గ్రామం

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహా లు చేస్తోంది. సాంకేతికతను జోడించి ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కింద జరుగుతోన్న పనుల న్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఉపాధి కింద చేప ట్టే పనుల్లో ఎలాంటి అవకతవలకు చోటులేకుండా ప్రత్యేకంగా యాప్‌ ను రూపొందించింది. ఇకనుంచి ఈ పథకం కింద శాటిలైట్‌ ఆధారంగా పనులను గుర్తించనున్నారు. దీని ఆధారంగా పనుల మంజూరుతోపా టు కూలీల వివరాలు, ఇందుకు అయిన ఖర్చు కు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిబంధనలు ఎప్పటికప్పటికీ మారుతున్నా, అవకతవకలు జరుగుతూనే ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. అక్రమాలను నివారించేందు కు పనుల వివరాలను యాప్‌లో నిక్షిప్తం చేసేలా ప్రభుత్వం చర్యలు చేట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బ్యాచ్‌లుగా విభజించి సాంకేతిక సిబ్బందికి వారం రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ‘భువన్‌’ యాప్‌ వివిధ రకాల పనుల వివరాలు నమోదు చేస్తుండగా, అదే యాప్‌ లో నూతనంగా ‘యుక్తధార’లో పనుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో మొత్తం 17 మండలాలు 428 గ్రామపంచాయతీలు ఉండగా, వీటిలో ముందుగా మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. జిల్లాలోని 17 గ్రామాల్లో ఈ యాప్‌ కింద పనులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

శాటిలైట్‌ ద్వారా పనుల నమోదు

ఉపాధి హామీ పథకంలో ఇప్పటివరకు కేవలం ప్రాంతం చూపి, పనులను భువన్‌ యాప్‌లో నమోదు చేసేవారు. పనులు పూర్తి చేసిన తర్వాత వివరాలను నమోదు చేస్తే సరిపోయేది. చేసిన పనుల వివరాలను ఆ ప్రాంతంలో ఎక్కడి నుంచైనా నమోదు చేసినా ఇబ్బంది ఉండేది కాదు. ఈ సంవత్సరంలో పనిచేస్తే మరో ఏడాది సామాజిక తనిఖీ అనంతరం మళ్లీ అక్కడ పనిచేసినా యాప్‌లో తీసుకునేది. ప్రస్తుతం పనులు చేసే వివరాలను ముందుగానే శాట్‌లైట్‌ ద్వారా యుక్తధార యాప్‌ నమోదు చేయాల్సిఉంటుంది. రోజువారీగా పనుల వద్దకు వెళ్లి నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం చేసిన పని మరో సంవత్సరంలో చేస్తే యాప్‌ అంగీకరించదు. దీంతో పనుల్లో పారదర్శకతతోపాటు పనుల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. పనులు, కూలీల వివరాలు, ఎంత వ్యయం చేశారన్న వివరాలు యాప్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుంది.

ఈసీ, టీఏలకు శిక్షణ షురూ..

ప్రస్తుతం మండలంలోని సాంకేతికసలహాదారు(ఈసీ), సాంకేతిక సహాయకుడు(టీఏ)లకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో మూడు ఈసీ పోస్టులు, 12 మంది టీఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో ఈసీలు, టీఏలు లేకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఖాళీగా ఉన్న పోస్టుల్లో పక్క మండలాల సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగించి పనులు చేయిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన పంచాయతీలకు టీఏను నియమిచంలేదు. దీంతో ప్రస్తుతం ఉన్నవారితోనే చేపడుతున్నారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు 90శాతం ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 7.66లక్షల జాబ్‌కార్డులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 7.66లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1.43లక్షల జాబ్‌ కార్డులు ఉండగా, 2.63లక్షల మంది కూలీలు ఉన్నారు. పనిచేసే (యాక్టివ్‌) కూలీలు 1.29లక్షల మంది ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 3.60లక్షల జాబ్‌ కార్డులుండగా, 7.66 లక్షల మంది కూలీలు ఉన్నారు. పనిచేసే వారు 2.22 లక్షల మంది ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 2.63లక్షల జాబ్‌ కార్డులుండగా, 5.69లక్షల మంది కూలీలు ఉన్నారు. పనిచేసే కూలీలు 1.99లక్షల మంది ఉన్నారు. 2025-26 సంవత్సరంలో చేపట్టబోయే పనులపై అధికారులు కార్యాచరణ రూపొందించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 32,33,056 పనిదినాలకు కూలీలకు దాదాపు రూ.96,99,16,800 బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. అయితే సామగ్రికి సంబంధించిన నిధులు అదనంగా ఉంటాయి. గ్రామాల్లో గుర్తించిన పనులను చేపట్టేందుకు అవసరమయ్యే నిధులపై అధికారులు గ్రామాలవారీగా ప్రణాళికలు రూపొందించారు. ఉపాధి హామీ పథకం కింద సీసీరోడ్లు, మెటల్‌రోడ్లు వేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.

‘యుక్తధార’ యాప్‌పై శిక్షణ ఇస్తున్నాం: నాగిరెడ్డి, డీఆర్డీవో

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోం ది. ఈ పథకాన్ని ఇప్పటికే భువన్‌ యాప్‌ ద్వారా పనులు, కూలీ ల వివరాలు నమోదు చేస్తున్నా రు. అయితే శాటిలైట్‌ ఆధారంగా పనులు చేపట్టేలా ప్రభుత్వం యుక్తధారయా్‌పను రూపొందించింది. ఇకనుంచి ఈ యాప్‌ద్వారా పనుల గుర్తింపుతోపాటు వివరాలు నమోదు చేసేందుకు ఉపాధి హామీ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.గ్రామాలవారీగా చేపట్టనున్న పనులపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పనులను గుర్తిస్తున్నాం.

Updated Date - Jul 05 , 2025 | 12:33 AM