ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ABN, Publish Date - Apr 12 , 2025 | 11:38 PM

:ఉన్నత చదువు చదివిన ఉద్యోగం రాలేదన్న ఆందోళనతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని ఎరసానిగూడెం గ్రామంలో శుక్రవారం జరిగింది.

సంపతకుమార్‌రెడ్డి(ఫైల్‌)

కట్టంగూరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):ఉన్నత చదువు చదివిన ఉద్యోగం రాలేదన్న ఆందోళనతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని ఎరసానిగూడెం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎరసానిగూడెం గ్రామానికి చెందిన యఆపాల సంపత కుమార్‌రెడ్డి(24) తన తల్లి లక్ష్మమ్మ, అన్న వెంకటరమణారెడ్డితో కలిసి ఐదేళ్ల నుంచి నార్కట్‌పల్లిలో ఉంటూ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఎంసీఏ కోర్సు చేసినా ఉద్యోగం రాకపోవడంతో యూఎ్‌సఏ వెళ్దామని ప్రయత్నించినా సఫలం కాలేదు. కొంతకాలం నుంచి ఆందోళనలో ఉన్నాడు. ఈ నెల 11న నార్కట్‌పల్లిలోని తల్లి లక్ష్మమ్మకు నల్లగొండ వెళ్తున్నట్లు చెప్పి స్వగ్రామమైన ఎరసానిగూడెంలోని సొంత ఇంటికి అదేరోజు వచ్చాడు. ఇంటికి వచ్చి ఫోనలో తల్లితో బాధపడుతూ మాట్లాడాడు. కొద్దిసేపటి తరువాత తల్లి ఫోన చేసినా సంపతకుమార్‌రెడ్డి ఫోన ఎత్తకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. ఇదే విషయమై నార్కట్‌పల్లి పోలీ్‌సస్టేషన వెళ్లి ఫోనసిగ్నల్‌ తెలుసుకోగా కుమారుడు ఎరసానిగూడెం వైపు ఉన్నట్లు చూపించింది. దీంతో ఆందోళన చెందిన ఆమె బంధువులతో కలిసి ఇంటివద్దకు వెళ్లి కిటికిలోంచి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. ఇంట్లోకి వెళ్లిచూసేప్పటికే సపంతకుమార్‌రెడ్డి మృతి చెందాడు. తన తమ్ముడు ఉద్యోగం రాకపోవడం, యూఎ్‌సఏ వెళ్లలేక పోయానని మనస్తాపంతో ఆత్మహత్య పాల్పడినట్లు అన్న యంపాల వెంకటరమణారెడ్డి శనివారం పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 12 , 2025 | 11:38 PM