గాలి దుమారం, వర్షం
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:24 AM
మండలంలోని గుడుగుంట్లపాలెంలో శనివారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నేరేడుచర్ల నుంచి జానపహాడ్ వెళ్లే రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పాలకవీడు, జూన 7 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గుడుగుంట్లపాలెంలో శనివారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నేరేడుచర్ల నుంచి జానపహాడ్ వెళ్లే రహదారిపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ అవసరాల కోసం ఏర్పాటుచేసిన ట్రాన్సఫార్మర్ కూలిపోయింది. పలుచోట్ల విద్యుత స్తంభాలు విరిగి విద్యుత సరఫరా నిలిచింది. చెట్లు విద్యుత తీగలమీద పడడంతో స్తంభాలు విరిగి తీగలు తెగిపోయాయి. చెట్లు కూలి రహదారి మీద పడడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత అధికారులు, పోలీసులు స్థానికుల సహాయంతో చెట్లు తొలగించే పనులు చేపట్టారు. విరిగిన స్తంభాలు, తెగిన తీగలను సరిచేసి విద్యుతను పునరుద్ధరించే పనులను ట్రాన్సకో అధికారులు చేపట్టారు.
Updated Date - Jun 08 , 2025 | 12:24 AM