వాసాలమర్రి దశ తిరిగేనా?
ABN, Publish Date - Jun 19 , 2025 | 12:28 AM
మండలంలోని వాసాలమర్రి గ్రామాభివృద్ధిపై ప్రజల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి.ఈనెల 6వతేదీన సీఎం రేవంత్‌రెడ్డి సభలో మా ట్లాడుతూ కేసీఆర్ హామీ ఇచ్చి వదిలేసినట్లుగా తాము చే యమని,వాసాలమర్రి ఇక్కట్లుతీరుస్తానని చెప్పడం, నేడు మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి గ్రామంలో పర్యటిస్తుండటంతో గ్రామ దశ తిరగనుందని భావిస్తున్నారు.
నేడు గ్రామానికి మంత్రి పొంగులేటి
గ్రామాభివృద్ధికి హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి
వారం రోజులుగా గ్రామంలో అధికారుల అధ్యయనం
తుర్కపల్లి,జూన్ 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని వాసాలమర్రి గ్రామాభివృద్ధిపై ప్రజల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి.ఈనెల 6వతేదీన సీఎం రేవంత్‌రెడ్డి సభలో మా ట్లాడుతూ కేసీఆర్ హామీ ఇచ్చి వదిలేసినట్లుగా తాము చే యమని,వాసాలమర్రి ఇక్కట్లుతీరుస్తానని చెప్పడం, నేడు మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి గ్రామంలో పర్యటిస్తుండటంతో గ్రామ దశ తిరగనుందని భావిస్తున్నారు. సీఎం ఆ దేశాలతో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య,కలెక్టర్ హనుమంతరావుతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి బుధశారం గ్రామంలో పర్యటించి సమస్యలపై అధ్యయ నం చేశారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 227 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారందరికీ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి గురువారం ఇళ్లు మం జూరు పత్రాలు అందజేసేందుకు ఏర్పాటు చేశారు.
అన్నీ అసంపూర్తి పనులు...
మాజీ సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామ పునర్నిర్మాణం చేసి గ్రామ రూపురేఖలే మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు గ్రామస్థుల ఆర్థి క స్థితిగతులు, జీవన ప్రమాణాలు, గ్రామంలోని మౌలిక వసతులు తదితర అంశాలపై రచ్చబండలో చర్చించి ప్రజల ఆర్థిక, ఆరోగ్య స్థితి గతులపై హెల్త్‌ప్రొఫైల్ తయారు చేశారు. గ్రామంలో పక్కా ఇళ్లు, అంతర్గ మురుగుకాల్వల నిర్మాణం, పాఠశాలల భవన నిర్మాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీ సబ్‌సెంటర్ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ. 58.25కోట్లు అప్పటి ప్రభుత్వం మంజూరుచేసింది. ఆయా నిధులతో గ్రామ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించి కొన్ని అభివృ ద్ధి పనులు చేపట్టారు. ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రం తో పాటు పీహెచ్‌సీ సబ్‌సెంటర్, విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవన నిర్మాణా ల పనులు స్లాబ్‌వరకు వచ్చి అసంపూర్తిగా నిలిచిపోయా యి. గత ప్రభుత్వం నిధులు సకాలంలో మంజూరు చేయకపోవడంతో గ్రామంలో చేపట్టాల్సిన పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో అభివృ ద్ధి కుంటుపడింది. గ్రామం లో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ కోసం కొందరి ఇళ్లు కూ ల్చివేశారు. వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఎవరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు మాత్రం రాలేదు.
ఆశలో ఎదురుచూపులు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రామ పునర్నిర్మాణం చేపట్టి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి వాసాలమరిన్రి బంగారు వాసాలమర్రిగా మారుస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయింది. గ్రామంలో పలు అభివృద్ధి పనులు మధ్యలోనూ నిలిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో గ్రామంలో మళ్లీ అధికారులు వారం రోజులుగా పర్యటించి గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిలిచిపోయిన పనులపై అధ్యయనంచేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను కొనసాగిస్తారా లేక కొత్త పథకాలతో కొత్త పనులను చేపడుతారా అని గ్రామస్థులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
Updated Date - Jun 19 , 2025 | 12:28 AM