బకాయిలు ఎప్పుడిచ్చేనో?
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:58 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏళ్లుగా విడుదల చేయకపోవడంతో డిగ్రీ కళాశాల ల యాజమాన్యాలు ఆందోళనలు నిర్వహించడంతోపాటు ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరించాయి. అయినా ప్రభుత్వం స్పందించ డం లేదు. టోకెన్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా బకాయిలు అందకపోవడంతో అటు యాజమాన్యాలు, పరీక్షలు నిలిచిపోవడంతో ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.160కోట్లు
ఉపముఖ్యమంత్రిని కలిసి విన్నవిం చినా పరిష్కారానికి నోచని సమస్య
ఇప్పటికే రెండుసార్లు కళాశాలల బంద్
ప్రాక్టికల్స్ బహిష్కరణ, పరీక్షలకు దూరం
(ఆంధ్రజ్యోతి,కోదాడ) : ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏళ్లుగా విడుదల చేయకపోవడంతో డిగ్రీ కళాశాల ల యాజమాన్యాలు ఆందోళనలు నిర్వహించడంతోపాటు ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరించాయి. అయినా ప్రభుత్వం స్పందించ డం లేదు. టోకెన్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా బకాయిలు అందకపోవడంతో అటు యాజమాన్యాలు, పరీక్షలు నిలిచిపోవడంతో ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఎంజీ యూనివర్సిటీ పరిధిలో 62 డిగ్రీ కళాశాలలు ఉండగా, అందులో 12 ప్రభుత్వ, 50 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరం ముగిసింది. ఇప్పటికే కళాశాలలకు గత నాలుగేళ్లుగా సుమారు రూ.100కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రావాల్సి ఉండగా, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో రూ.60కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పాత బకాయిలకు సంబంధించి 2023 డిసెంబరులో ట్రెజరీశాఖ టోకెన్లు జారీ చేయగా, ఈ-కుబేర్‌లో ఉన్నాయి. ఈ బకాయిలు నేటికీ అందకపోవడంతో కళాశాల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బకాయిలు విడుదల కోసం పలుమార్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్కను కలిసి విన్నవించగా, చెల్లింపులపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. దీంతో చేసేదిలేక యాజమాన్యాలు ఇప్పటికే రెండుసా ర్లు కళాశాలల బంద్ నిర్వహించడంతోపాటు ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలను బహిష్కరించాయి. అయినా విద్యాశాఖ మంత్రి అయిన సీఎం రేవంత్‌రెడ్డి కళాశాలల బకాయిలపై స్పందించకపోవడంతో యాజమాన్యాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. దీంతో ఉన్నత విద్యకు దూరమవుతున్నామని విద్యార్థులు బావురుమంటున్నారు. మరో పక్క అధ్యాపకులకు నెలల తరబడి వేతనాలు, భవన యజమానులకు అద్దెలను యాజమాన్యాలు బకాయిపడ్డాయి. ఇదిలా ఉంటే దోస్త్ (తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీ్‌స)తో డిగ్రీలో 2023-24 విద్యా సంవత్సరంతో పోల్చితే 2024-25లో అడ్మిషన్లు తగ్గడం కళాశాలల యాజమాన్యాలను ఆందోళనపరుస్తోంది. విద్యార్థులు తగ్గడం, అరకొరగా వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో, కళాశాలలను ఎలా నడపాలో అర్థం కావటంలేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సీఎం చొరవతీసుకొని బకాయిలను విడదల చేసి, పరీక్షలు జరిగేలా చూడాలని కళాశాలల యజమానులు, విద్యార్థులు కోరుతున్నారు.
వచ్చే నెల 15కు పరీక్షలు వాయిదా
కళాశాలల బంద్ చేపట్టడంతోపాటు ప్రాక్టికల్స్ పరీక్షలను ప్రైవేట్ కళాశాలలు బహిష్కరించాయి. అయి నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో యాజమాన్యాలు ఈ నెలలో యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన థియరీ పరీక్షలకు దూరంగా ఉన్నాయి. ఈ నెల 11 నుంచి జరగాల్సిన 2, 4, 6వ సెమిస్టర్‌తోపాటు, బ్యాక్‌లాక్ పరీక్షలను ఎంజీయూ మే 15కు వా యిదా వేసింది. అయితే సకాలంలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఏళ్లుగా అందని ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్
ప్రభుత్వం విద్యార్థులకు ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ కింద ఉపకార వేతనాలు ఇస్తుంది. మెయింట్‌నెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజు(ఎంటీఎఫ్) కింద విద్యార్థికి నెలకు రూ.500చొప్పున, 10 నెలలకు రూ.5,000 ఇస్తుంది. ఆ ఫీజు విద్యార్థి బ్యాంక్ అకౌంట్‌లో జమచేస్తుంది. ఎంటీఎఫ్ రెండేళ్లుగా విద్యార్థులు అందడం లేదు. అదే విధంగా రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు (ఆర్‌టీఎఫ్) కింద సైన్ విద్యార్థులకు రూ.12వేలు, ఆర్ట్స్ విద్యార్థులకు రూ.9వేలు కళాశాల ప్రిన్సిపాల్ అకౌంట్‌లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఇది నాలుగేళ్లుగా రావడంలేదని కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు.
తగ్గిన అడ్మిషన్లు
ఎంజీ యూనివర్సిటీ పరిధిలో 50 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 30వేల సీట్లు ఉన్నాయి. 2024 విద్యా సంవత్సరంలో మొదటి ఏడాదిలో సుమారు 6వేల మంది విద్యార్థులు చేరారు. 12 కళాశాలల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. 30 కళాశాలల్లో కేవలం 30మంది మాత్రమే చేరారు. దీంతో కళాశాలలకు వచ్చే ఫీజురీయింబర్స్‌మెంట్ తక్కువగా ఉంటుంది. వచ్చే అరకొర రీయింబర్స్‌మెంట్ సకాలంలో విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. చివరికి అటెండర్లకు, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిర్వాహకులు వాపోతున్నారు.
డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినా
ఉమ్మడి జిల్లాలో 62 డిగ్రీ కళాశాలలు ఉండగా, వాటిలో 50 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పాత బకాయిలు సుమారు రూ.100కోట్లు రావాల్సి ఉంది. తాజాగా ముగిసిన విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.60కోట్ల బకాయిలు ఉన్నా యి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం గా రూ.160కోట్ల బకాయిలు ఉండగా, వీటి ని చెల్లించాలని గత ఏడాది అక్టోబరులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ను కళాశాలల యజమానులు కలిసి విన్నవించారు. దీంతో గత ఏడాది నవంబరులో నే వాటిని చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తిరిగి నవంబరులో డిప్యూటీ సీఎంను యజమానులు కలవగా, డిసెంబరులో చెల్లించేందుకు హామీ ఇచ్చారు. డిసెంబరులో కలవగా, ఈ ఏడాది జనవరిలో చెల్లిస్తామని చెప్పారని, అయినా నేటికీ బకాయిలు విడుదల చేయలేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. టోకెన్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా బకాయిలు అందలేదని దీంతో కళాశాలల బంద్ చేపట్టడంతోపాటు, ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలకు దూరంగా ఉన్నామని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేదని వాపోతున్నాయి.
చెల్లిస్తే ఇబ్బందులు ఉండవు : బి.సూర్యనారాయణరెడ్డి, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి. నాలుగేళ్లుగా రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో పైసలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. అప్పు తెచ్చి కళాశాలలు నడుపుతున్నాం. డిప్యూటీ సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని రెండు, మూడుసార్లు ఆయన హామీ ఇచ్చారు. 2023లో రూ.25కోట్ల బకాయిలకు ట్రెజరీశాఖ టోకెన్లు ఇచ్చిం ది. వాటిలో కొంతమందికి రూ.లక్ష, రూ.50వేలు వ చ్చాయి. కొంతమందికి అసలు రాలేదు. సంవత్సరాల తరబడి ఫీజులు రాకపోతే కళాశాలలు ఎలా నడపాలో ప్రభుత్వమే చెప్పాలి. గత్యంతరం లేక ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తే పరీక్షల నిర్వహణకు సహకరిస్తాం.
వెంటనే బకాయిలు చెల్లించాలి
దేవరకొండ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.4500కోట్ల స్కాలర్‌షి్‌ఫలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివా్‌సగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం దేవరకొండలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి దేవరకొండ ఆర్డీవో కార్యాలయం ఎదు ట ధర్నా నిర్వ హించారు. అనంతరం ఆర్డీవో రమణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్య వసాయ కార్మికసంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కంభాలపల్లి ఆనం ద్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు వస్కుల సుధాక ర్, బీసీ సంఘం నాయకులు వరికుప్పల శ్రీను, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, ఆంజనేయులు, మోతిలాల్, గణేష్, సైదిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 12:58 AM