ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సబ్‌స్టేషన నిర్మాణం ఎప్పుడు?

ABN, Publish Date - Jul 24 , 2025 | 12:44 AM

విద్యుత లో వోల్టేజీ సమస్యను తీర్చేందుకు, విద్యుత సరఫరాలో పదే పదే విద్యుత అంతరాయాన్ని తొలగించేందుకు. ఉన్న, సబ్‌స్టేషన్లపై అదనపు భారం తగ్గించేందుకు గత ప్రభుత్వం జిల్లాలో నూతన సబ్‌ స్టేషన్లను మంజూరు చేసింది.

స్థల సేకరణ జరిగి ఎనిమిదేళ్లయినా సబ్‌స్టేషనకు నోచుకోని స్థలం

శిలాఫలకం వేసి ఎనిమిదేళ్లు

నిధులున్నా ప్రారంభం కాని పనులు

రాజాపేట, జూలై 23(ఆంధ్రజ్యోతి): విద్యుత లో వోల్టేజీ సమస్యను తీర్చేందుకు, విద్యుత సరఫరాలో పదే పదే విద్యుత అంతరాయాన్ని తొలగించేందుకు. ఉన్న, సబ్‌స్టేషన్లపై అదనపు భారం తగ్గించేందుకు గత ప్రభుత్వం జిల్లాలో నూతన సబ్‌ స్టేషన్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా రాజాపేట మండలంలోని దూది వెంకటాపూర్‌ గ్రామంలో 2017సంవత్సరంలో రూ.3కోట్లతో 33/11కేవీ విద్యుత సబ్‌స్టేషన నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. ఒక ఎకరం ప్రభుత్వ భూమిని సబ్‌స్టేషన నిర్మాణం కోసం కేటాయించారు. పనులు ప్రారంభించేందుకు గాను 2017 జనవరి 20వ తేదీన అప్పటి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి ఆర్బాటంగా సబ్‌స్టేషన నిర్మాణం కోసం శిలాఫలకాన్ని వేశారు. అయినప్పటికి విద్యుత సబ్‌ స్టేషన సనులు ఎనిమిదేళ్లయిన ప్రారంభానికి నోచుకోలేదు. సబ్‌స్టేషన స్థలం కంపచెట్లతో నిండి పోయి వెక్కిరిస్తోంది. పనులు ప్రారంభమవుతాయా లేదా అని రైతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్టేషన నిర్మాణానికై రైతులు ఎన్నోమార్లు అధికారులకు, నాయకులకు మొరపెట్టుకున్నారు. సబ్‌స్టేషన నిర్మాణం పనులను ప్రారంభించి విద్యుత లోవోల్టేజీ సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

నాలుగు సబ్‌స్టేషన్ల నుంచి విద్యుత సరఫరా

మండలంలో నాలుగు సబ్‌స్టేషనల ద్వారా విద్యుత సరఫరా జరుగుతోంది. మండలంలోని రాజాపేట, పాముకుంట, బొందుగుల, పొట్టిమర్రి గ్రామాల్లో విద్యుత సబ్‌స్టేషన్లు ఉన్నాయి. మండలంలో ఈ నాలుగు సబ్‌స్టేషన్లతో పాటు కొలనుపాక నుంచి సరఫరా జరుగుతోంది. దీంతో విద్యుత లోవోల్టేజీ సమస్యతో పాటు పదేపదే విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. సమస్యల పరిష్కారానికి దూది వెంకటాపూర్‌ గ్రామానికి విద్యుత సబ్‌స్టేషన మంజూరు చేశారు. ఈ సబ్‌స్టేషన నిర్మాణం పూర్తయితే సోమారం, దూది వెంకటాపూర్‌, నగరం,ఽ దర్మారెడ్డిగూడెం, నెమిల,రాజానగర్‌ గ్రామాల ప్రజలకు ప్రయోజనంగా ఉంటుంది. వీటి పరిధిలో సుమారు 1000 బోర్లు, బావులు, 1500 గృహాల కనెక్షన్లు ఉన్నాయి. దూది వెంకటాపూర్‌ విద్యుత సబ్‌స్టేషనతో మండలం లోని రాజాపేట, బొందుగుల, కొలనుపాక, పొట్టిమర్రి సబ్‌స్టేషన్లపై అదనపు భారం తగ్గుతుంది.

సబ్‌స్టేషన పనులు ప్రారంభించాలి

విద్యుత లోవోల్టేజీని, విద్యుత సరఫరాలో అంతరాయాన్ని నిరోధించేందుకు విద్యుత సబ్‌స్టేషన పనులను వెంటనే ప్రారంభించాలి. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సబ్‌స్టేషన పనులను అధికారులు మొదలు పెట్టాలి. ఐదారు గ్రామాల ప్రజలకు ప్రయోజనంగా ఉంటుంది.

-ఊకంటి బుచ్చిరెడ్డి, రైతు, దూది వెంకటాపూర్‌

సబ్‌స్టేషన నిర్మాణం టెండర్‌ ప్రక్రియలో ఉంది

రాజాపేట మండలంలో మెరుగైన విద్యుత సేవలు అందిస్తున్నాం. దూది వెంకటాపూర్‌లో సబ్‌స్టేషన నిర్మాణంకోసం 3కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. టెండర్‌ ప్రక్రియలో ఉంది. మండలంలోని నాలుగు సబ్‌స్టేషనల పరిధిలో విద్యుత సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేశాం. చల్లూరు, రేణుకుంట, కుర్రారం, ధర్మారెడ్డిగూడెంకు కొత్త ఫీడర్లను ఏర్పాటు చేశాం.

-బందారపు చంద్రశేఖర్‌, మండల విద్యుత అధికారి, రాజాపేట

Updated Date - Jul 24 , 2025 | 12:44 AM