ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సొంతింటి కల నెరవేరుతున్న వేళ

ABN, Publish Date - Jul 13 , 2025 | 12:59 AM

పేదల సొంతింటి కల నెరవేరుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదలు ఇళ్లు కట్టుకుంటున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఉండేందుకు ఇల్లు లేని ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఒక వరంగా మారింది.

శరవేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు

ఇప్పటికే పలుచోట్ల జరిగిన గృహ ప్రవేశాలు

మండలాలవారీగా సమీక్షిస్తున్న ప్రభుత్వ అధికారులు

100 శాతం నిర్మాణ లక్ష్య సాధనకు వ్యూహం

(ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట రూరల్‌): పేదల సొంతింటి కల నెరవేరుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదలు ఇళ్లు కట్టుకుంటున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఉండేందుకు ఇల్లు లేని ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం ఒక వరంగా మారింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపికతోపాటు పనులు ప్రారంభమైన నాటి నుంచి ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇంటి నిర్మాణ పనులు మొదలైన స్వల్ప కాలంలోనే నిధులు మంజూరై, గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 9,175 ఇళ్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఇప్పటివరకు 6వేల వరకు గ్రౌండింగ్‌ పూర్తికాగా, మరో 3,175 ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాల్సి ఉంది. ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు మరో 500 ఇళ్లకు ప్రతిపాదన పంపినట్లు తెలిసింది. ప్రతీ సోమవారం కలెక్టర్‌ హ నుమంతరావు, ఇతర అధికారులు ఇందిరమ్మ ఇళ్లపై పర్యవేక్షణ చేస్తూ వాటి వివరాల ను అడిగి తెలుసుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్న లబ్ధిదారులకు మహిళా సంఘాల రుణాలు ఇప్పించి వాటిని ని ర్మించుకునే విధంగా కృషి చేస్తున్నారు. నిర్మాణ దశల వారీగా బేస్‌మెంట్‌కు రూ.లక్ష, గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్‌కు రూ.2లక్షలు గృహప్రవేశం సమయంలో రూ.లక్షను అధికారులు మం జూరు చేస్తూ లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నారు.

సొంతింటి కల నెరవేరింది : ఎగ్గిడి స్వప్నబాలమల్లేశ్‌, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు

పదేళ్ల నుంచి ఇల్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య సహకారంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. గృహ ప్రవేశం మంత్రి లక్ష్మణ్‌కుమార్‌తో చేయించుకోవడం ఆనందంగా ఉంది. ప్రభుత్వ విప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తున్నాం : భాస్కర్‌రావు, అదనపు కలెక్టర్‌

జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్మాణాల దశలను పరిశీలిం చి వెంటనే డబ్బులు ఖాతాల్లో జమచేయిస్తున్నాం. తాపీ, ఇసుక, ఇటుక, ఇంటి సామగ్రి యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ధరలను అదుపులో ఉంచాం. 45 రోజుల్లో ఇళ్లు పూర్తయ్యే అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

విప్‌ బీర్ల అయిలయ్యకు కృతజ్ఞతలు : దుంబాల వెంకట్‌రెడ్డి, సైదాపురం

మా గ్రామానికి ప్రభుత్వ విప్‌ ముందుగా 63 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందులకు కృతజ్ఞతలు. జిల్లాలోనే సైదాపురం గ్రామాన్ని అన్ని పథకాలు అందించి ముందువరుసలో ఉంచారు.

Updated Date - Jul 13 , 2025 | 12:59 AM