ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బోధనాసుపత్రుల బాగుకు ఏంచేద్దాం?

ABN, Publish Date - Jul 01 , 2025 | 12:32 AM

ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనాసుపత్రుల అభివృద్ధికిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేట్‌ వైద్య కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల పనితీరు తీసికట్టుగా ఉందని జాతీయ వైద్య కమిషన(ఎనఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటి నిర్వహణలో నెలకొన్న సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలు, బోధనాసుపత్రులకు రోగుల సంఖ్యను పెంచేందుకు తీసుకోవలసిన చర్యల నిమిత్తం ప్రభుత్వం వైద్య కళాశాలల మానిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ)లను ఏర్పాటుచేసింది.

ఎంసీఎంసీ తనిఖీల అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేత

అందుకు అనుగుణంగా నిధులు, సౌకర్యాలు

(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన)

ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనాసుపత్రుల అభివృద్ధికిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేట్‌ వైద్య కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల పనితీరు తీసికట్టుగా ఉందని జాతీయ వైద్య కమిషన(ఎనఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటి నిర్వహణలో నెలకొన్న సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలు, బోధనాసుపత్రులకు రోగుల సంఖ్యను పెంచేందుకు తీసుకోవలసిన చర్యల నిమిత్తం ప్రభుత్వం వైద్య కళాశాలల మానిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ)లను ఏర్పాటుచేసింది. ఈ కమిటీలలో వైద్య ఆరోగ్య శాఖ హెచఎండీ, కార్యదర్శి స్థాయి అధికారులతో ఏర్పాటుచేసిన కమిటీలలో జిల్లా కలెక్టర్‌, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్‌ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు ఆయా కమిటీలు ప్రభుత్వ వైద్యకళాశాలలు, బోధనాసుపత్రులను తనిఖీ చేసి కళాశాలల వారిగా వైద్యారోగ్య శాఖకు నివేదిక అందజేస్తాయి. నివేదికలు ఆధారంగా జూన 2028 నాటికి అన్నిరకాల సమస్యలు పరిష్కరించి పూర్తిస్థాయి వసతులను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి, నల్లగొండ, సూర్యాపేటలో వైద్య కళాశాలలు ఉన్నా యి. త్వరలో జరుగనున్న ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌, కళాశాలల అనుమతుల రెన్యూవల్‌, సీట్ల పెంపు దరఖాస్తుల పరిశీలన తదితర లక్ష్యాలతో ఎనఎంసీ తనిఖీల ప్రారంభం ముందు ఎంసీఎంసీ బృందాలు తనిఖీ అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులలో సమస్యలు తీరుతాయని అధికారులు భావిస్తున్నారు. కాగా 50 సీట్లతో గత విద్యా సంవత్సరంలో ప్రారంభమైన భువనగిరి ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ సంవత్సరం కూడా ఎనఎంసీ అనుమతులను రెన్యూవల్‌ చేయగా సీట్ల పెంపు మాత్రం మొదటి బ్యాచ పాస్‌ అవుట్‌ అయ్యాకే ఉంటుంది.

భువనగిరి కళాశాలలో

భువనగిరి ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనాసుపత్రిలో ఇటీవల వరకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో బోధనాసుపత్రిలో పనితీరు మెరుగుపడలేదు. అలాగే అద్దె భవనంలో కొనసాగుతున్న వైద్యకళాశాలలో కూడా ఉద్యోగ ఖాళీలు, ల్యాబ్‌ల ప్రమాణాలు దిగదుడుపుగా ఉన్నాయని మెడికోలు ఆరోపిస్తున్నారు. అలాగే కళాశాల మొదటిబ్యాచకు చెందిన ద్వితీయ సంవత్సరం వైద్య విద్యార్థులకు భువనగిరిలోని బోధనాసుపత్రిలో క్లినికల్‌ పోస్టింగులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ మూడు నెలలం క్రితం రూ.కోట్లు వ్యయం చేసి సిటీ స్కాన అందించినా టెక్నీషియన్ల కొరత, హైపర్‌ కనెక్షన లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. ఓపీ, ఐపీకి అనుగుణంగా వసతులు లేని పరిస్థితి నెలకొంది. వైద్యులు, అధికారులు, నర్సింగ్‌, ఇతర సిబ్బంది ఖాళీలు, పారిశుధ్యం తదితర ఇబ్బందులు వెంటాడుతున్నాయి. పేరుకే బ్లడ్‌ బ్యాంక్‌ ఉన్నప్పటికీ రోగులకు అందుతున్న సేవలు కనుచూపుమేరలో లేని లేవు. ఎంసీఎంసీలలో కలెక్టర్‌ కీలకపాత్ర పోషించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు వాటి పాలనలోనూ కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించడం, ఎంసీఎంసీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుండటంతో నిర్వహణ తీరు మెరుగుపడి రోగులకు, వైద్య విద్యార్థులకు మేలు జరుగుతుందని వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 12:32 AM