ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

ABN, Publish Date - Jul 17 , 2025 | 12:25 AM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రభు త్వ విప్‌ బీర్ల అయిలయ్య, కలెక్టర్‌ హనుమంతరావు, సంబంధిత అధికారులతో కలిసి జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు.

ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేకశ్రద్ధ వహించాలి

పేదలందరికీ రేషన్‌ కార్డుల జారీ

ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

భువనగిరి (కలెక్టరేట్‌), జూలై 16 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రభు త్వ విప్‌ బీర్ల అయిలయ్య, కలెక్టర్‌ హనుమంతరావు, సంబంధిత అధికారులతో కలిసి జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల ప్రగతి, రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడారు. ప్రభుత్వం పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాల ప్రగతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, లబ్ధిదారులకు దశలవారీగా ప్రభుత్వం వారి ఖాతాలో డబ్బు జమ చేస్తుందన్నారు. పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే యోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తుందన్నారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశాబ్దకాలంలో ఒక్క రేషన్‌ కార్డును మంజూరు చేయలేదన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థ లు)భాస్కరరావు, ఆర్డీవో ఎం.కృష్ణారెడ్డి, భువనగిరి జోన్‌ డీసీపీ అక్షాంశ్‌యాదవ్‌, ఏసీపీ రాహుల్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ పీడీ విజయ్‌ సింగ్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రోజారాణి పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:25 AM