ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం
ABN, Publish Date - Jul 05 , 2025 | 01:02 AM
భువనగిరి పట్టణ సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కా రమే లక్ష్యమని భువనగిరి మునిసిప ల్ కమిషనర్ రామలింగం అన్నారు.
భువనగిరి మునిసిపల్ కమిషనర్ రామలింగం
‘ఫోన ఇన’కు సమస్యల వెల్లువ
‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నాన్ని అభినందించిన ప్రజలు
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన)
భువనగిరి పట్టణ సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కా రమే లక్ష్యమని భువనగిరి మునిసిప ల్ కమిషనర్ రామలింగం అన్నారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన మునిసిపల్ కమిషనర్ ‘ఫోన ఇన’కు భారీ స్పందన వచ్చింది. పట్టణంలోని అన్ని ప్రాం తాల నుంచి పలువురు కమిషనర్‌కు సమస్యలు తెలిపారు.
పి.మాధవి, గాంధీనగర్: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక ఎప్పుడు ఇస్తారు?
కమిషనర్: ఉచిత ఇసుక సరఫరాపై రెవెన్యూ శాఖ పరిశీలిస్తోంది. త్వరలోనే స్పష్టత వస్తుంది.
బి.రమాదేవి, పోచమ్మవాడ: రెండేళ్ల క్రితం డబుల్ బెడ్‌రూం ఇళ్లు లాటరీ విధానంలో కేటాయించారు. కానీ నేటికీ అప్పగించకపోవడంతో అద్దె ఇంట్లోనే నివాసం ఉంటున్నాం. ఇంకా ఎప్పుడు ఇళ్లు ఇస్తారు?
కమిషనర్: మరమ్మతు పనులను త్వరలోనే చేపట్టి పూర్తి చేశాక అప్పగిస్తాం. మరమ్మతు పనులను ప్రజా రోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది.
జె.శివప్రసాద్, ఇందిరానగర్: సుమారు రూ.8 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు?
కమిషనర్: మార్కెట్ ఆవరణలో ఇటీవలే సీసీ రోడ్డు పనులు చేపట్టాం.మరికొన్ని పనులు ఉన్నా యి.త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం.
పి.పూర్ణచందర్‌రావు, బీచమహల్లా: గత కమిషనర్ల లాగే మీరు సమస్యల పరిశీలనకు ఎందుకు బస్తీల పర్యటన చేయడం లేదు? రహదారుల వెం ట పెరిగిన ఆక్రమణలు, ఇష్టానుసారం పార్కింగ్ తో ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి?
కమిషనర్: బస్తీల్లో తరచూ పర్యటిస్తున్నాం. గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తున్నాం.ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ ఇక్కట్లు తీరుస్తాం.
టీ.చంద్రశేఖర్, అర్బనకాలనీ: రూ.30లక్షల వ్యయంతో అర్బన కాలనీ వద్ద నిర్మించిన రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభిస్తారు? నిర్మాణానికి ముందు రైల్వే అనుమతులను ఎందుకు తీసుకోలేదు?
కమిషనర్: పనులు పూర్తయ్యాయి. కానీ రైల్వే శాఖ అభ్యంతరంతో తాత్కాలికంగా మూతబడిం ది.దీంతో ప్రయాణాలకు అనుమతించేలా రైల్వే శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నా.
కొడారి వెంకటేష్, నల్లగొండరోడ్: ఇందిరమ్మ ఇళ్లకు కమర్షియల్ విద్యుత మీటర్లు ఇస్తున్నారు. దీంతో వారిపై అధిక భారం పడుతుంది. ఎలా న్యాయం చేస్తారు?
కమిషనర్: సమస్యల పరిష్కారానికి ట్రాన్సకో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం. ఇందిర మ్మ ఇళ్లకు డొమస్టిక్ కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
పి.శివప్రసాద్, రత్నానగర్: మునిసిపల్ కార్యాలయం పక్కనే ఉన్న రహదారి కబ్జాకు గురయ్యింది. నెల రోజుల క్రితం పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు హద్దురాళ్లను నాటి వెళ్లా రు. ఆ వెంటనే కబ్జాదారులు హద్దు రాళ్లను తొలగించి వాహనాలను అడ్డుకుంటున్నారు.
కమిషనర్: పట్టణ ప్రణాళికా విభాగం కబ్జాపై చర్యలు తీసుకుంటుంది. ఆక్రమణకు గురైన రహదారిని స్వాధీనం చేసుకుంటాం. మరోమారు ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తే పోలీస్ కేసు నమోదు చేస్తాం. సీసీ రోడ్డు కూడా నిర్మిస్తాం.
కె.శ్రవణ్‌కుమార్: నల్లగొండ రోడ్డుపై ఎంఎనఆర్ గార్డెన, గంగావాటర్ ఫిల్టర్ పరిసరాల్లో ఇరుకై న మురికి కాల్వల కారణంగా తరచూ మురికి నీరు రహదారులపైకి ప్రవహిస్తుండడంతో పలు ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయి.
కమిషనర్: ఆప్రాంతంలోని మురికి కాల్వ నిర్మాణానికి ఇటీవలే నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు చేపట్టి సమస్య పరిష్కరిస్తాం.
సంపతకుమార్, మాధవరెడ్డి, న్యూరాంనగర్: న్యూరాంనగర్‌లో జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్‌ను అడ్డుకుని మా ఆరోగ్యాల ను కాపాడండి.
కమిషనర్: సెల్ టవర్ల నిర్మాణానికి నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాల్సి వస్తోంది. అయినప్పటికీ మరో మారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
వహీద్, సంతో్‌షనగర్: దుకాణ యజమానులు రోడ్డు వెంట ఏర్పాటు చేస్తున్న బోర్డులతో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలి.
కమిషనర్: త్వరలోనే స్పెషల్ రైడ్ నిర్వహించి బోర్డులను తొలగిస్తాం. మరోసారి ఏర్పాటు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
బ్రహ్మచారి, పహాడినగర్: జగదేవ్‌పూర్ రోడ్డులోని ఆర్వోబీపై ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. సీకులు తేలి వాహనాలు పంక్చర్ అవుతున్నాయి. పలు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నుంచి స్పందన కరువైంది.
కమిషనర్: ఆర్వోబీ మరమ్మతుల కోసం నేషన ల్ హైవే అథారిటీకి లేఖ రాశాం. మరోమారు ఆ అధికారుల దృష్టికి తెస్తాం. అయినా స్పందించకుంటే మునిసిపల్ నిధులతో మరమ్మతులు చేస్తాం.
నర్సింహ, విద్యానగర్: మా ఇంటిపై పని చేస్తున్న కార్మికుడు కోతుల దాడి నుంచి తప్పించుకునేందుకు ఇటీవల బంగ్లాపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కోతుల నియంత్రణలో మునిసిపల్ వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగింది.
కమిషనర్ : కోతులను పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో కోతులను పట్టుకున్న ఏజెన్సీతో ఇటీవలే మాట్లాడాం. త్వరలో సమస్య పరిష్కారం అవుతుంది.
శ్రీపతి, ఆర్‌బీనగర్: మా బస్తీలో వందకు పైగా వీధి కుక్కలున్నాయి?
కమిషనర్: వీధి కుక్కల నియంత్రణ కు నిబంధనలు అడ్డంకిగా మారుతున్నా యి. పరిష్కారం కోసం పట్టణ శివారులో రూ.45లక్షల వ్యయంతో పునరుత్పత్తి నివారణకు శస్త్ర చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. కొన్ని వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయించాం. మిగతా వీధి కుక్కలకు కూడా చేయిస్తాం. దీంతో క్రమేపీ వీధి కుక్కల సమస్య తీరుతుంది.
బలరాం, ఆజాద్‌రోడ్: మా బస్తీలోని శివాలయం వెనుక గేదెలను కట్టివేస్తుండడంతో పరిసరాల పరిశుభ్రతకు ఆటంకం అవుతోంది.
కమిషనర్: పెంపకం దారులకు నోటీసులు ఇచ్చి సమస్య పరిష్కరిస్తాం.
రమేష్, రెడ్డివాడ: మా బస్తీలోని బీసీ హాస్టల్ వద్ద ఇటీవల నిర్మించిన మురికి కాల్వ పొంగిపొర్లుతోంది ఫిర్యాదు చేసినా శానిటేషన సిబ్బంది పట్టించుకోవడం లేదు.
కమిషనర్: మీరు పంపిన వీడియోలు చూ శాం. సమస్యలను పరిష్కరిస్తాం. ఫిర్యాదులపై స్పందించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
సతీష్,22వ వార్డు: వెలగని వీధి దీపాలపై సిటిజన బడ్డీలోఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదు.
కమిషనర్: సిటిజన బడ్డీలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని గతంలోనే సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. మీ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటాం. సమస్య పరిష్కరిస్తాం.
వీరకుమార్, శృతినగర్ :కలెక్టరేట్ రోడ్డుపై రై ల్వే స్టేషన రోడ్డు వద్ద ఉన్న కల్వర్టు ద్వారా ప్రవహిస్తున్న మురికి నీరు ఇళ్లలోకి చేరుతోంది.
కమిషనర్ : కల్వర్టు మరమ్మత్తులకు ఆర్‌ఆండ్‌బికి లేఖ రాసాము, మరమ్మత్తు పనులు చేస్తామన్నారు. మరోమారు ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తాం.
శ్రీధర్, 9వ వార్డు: మా వార్డులో సీసీ రోడ్లు, మురికి కాల్వలు, వీధి దీపాలు లేక ఇబ్బందులకు గురవుతున్నాం. దుర్గందం వ్యాపిస్తోంది.
కమిషనర్: త్వరలో నిర్మాణ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరిస్తాం.
కృష్ణ, 19వ వార్డు: రేషనకార్డులో మా పిల్లల పేర్లు చేర్పించేలా ప్రజాపాలనలో దరఖాస్తు చేశాం. కానీ పిల్లల పేర్లు చేరలేదు.
కమిషనర్: తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అవసరమైతే మరోమారు దరఖాస్తు చేసుకోవచ్చు.
శ్రీనివా్‌సరెడ్డి, జంఖానాగూడెం: పట్టణ మురికి నీరంతా మా బస్తీలోకే చేరుతోంది.
కమిషనర్: సమస్య పరిష్కారానికి కాల్వ నిర్మాణం కోసం నిధులను కేటాయించాం. త్వరలోనే పనులు పూర్తి చేస్తాం.
మంద యాదగిరి, సమ్మద్‌చౌరస్తా: కోట్ల రూపాయల వ్యయంతో పట్టణ ప్రధాన రహదారిని విస్తరించినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో వాకింగ్ పాత, పార్కింగ్ జోన్లు ఆక్రమణకు గురై ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి.
కమిషనర్: పట్టణ ప్రధాన రహదారి ఫుట్‌పాతపై రూ.1.60 కోట్ల వ్యయంతో టైల్స్ పనులు చేపట్టనున్నాం. పనులు పూర్తయ్యాక ఆక్రమణలను శాశ్వతంగా తొలగిస్తాం. ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
పడిగెం అంజనేయులు, భూపాల్‌రెడ్డ్డి, పగిడిపల్లి: విలీన గ్రామమైన పగిడిపల్లి అభివృద్ధిని అధికారులు విస్మరిస్తున్నారు. మురికి నీ రు రహదారులపై పారుతోంది. పైపులైన లీకేజీ ఉన్నది. పారిశుధ్య పనులు నిర్వహించడం లేదు.
కమిషనర్: పట్టణ అభివృద్ధిలో అన్ని ప్రాం తాలను సమాంతర దృష్టితో చూస్తాం. పైపులైన లీకేజీపై ఎనహెచఏకు లేక రాసాము. త్వరలో పారిశుధ్య పనులు చేపడతాం.
బొర్ర రాఖేష్, కె.మంజుల, సతీష్, కె.వెంకటేష్, 22వ వార్డు : మా వార్డులోని కొత్త కాలనీలో మురికి కాల్వలు లేకపోవడంతో ఇళ్ల మధ్యే మురికి గుంతలు ఏర్పడ్డాయి.
కమిషనర్: మురికికాల్వల పనులకు నిధు లు మంజూరయ్యాయి. అయితే అవుట్‌లైనపై తలెత్తుతున్న ఇబ్బందులతో మురికి గుంతల సమస్య ఏర్పడుతోంది. త్వరలోనే పరిష్కరిస్తాం.
రమేష్, శారద ఎనక్లేవ్స్: మా బస్తీలో ఇటీవలే చేపట్టిన మురికి కాల్వ పనులు ఆగిపోయాయి. దీంతో మురికి నీరంతా రహదారిపై పారుతోంది. రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
కమిషనర్: కాంట్రాక్టర్ అలసత్వంతో పనుల్లో జాప్యం జరిగింది. తిరిగి రెండు రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది.
Updated Date - Jul 05 , 2025 | 01:02 AM