ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అక్కన్న మాదన్న ఆలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

ABN, Publish Date - Jul 01 , 2025 | 12:51 AM

శతాబ్దాల చరిత్ర కలిగిన అక్కన్న మాదన్న ఆలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు

ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

బీబీనగర్‌, జూన 30 (ఆంధ్రజ్యోతి): శతాబ్దాల చరిత్ర కలిగిన అక్కన్న మాదన్న ఆలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మహాదేవ్‌పూర్‌ గ్రామంలో గల ప్రాచీన నేపథ్యం కలిగిన అక్కన్న మాదన్న ఆలయాల ప్రాంగణంలో పర్యాటక అభివృద్ధిపై సంబంధిత టూరిజం జీఎం ఉపేందర్‌ రెడ్డి, తెలంగాణ దేవాలయాల ఆర్కి స్ర్టెక్చర్‌ బండారు శ్రీనివాస్‌ గుప్తాతో కలిసి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ఆలయ ప్రధాన పూజారులు శ్రీమన్నారాయణ వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ పరిసరాలను కలియ తిరిగి పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలుమార్లు ఇక్కడి ఆలయాలను సందర్శించినప్పుడు ఇక్కడి రాతి కట్టడాలు నిర్మాణ శైలి, ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం పర్యాటకానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని నియోజకవర్గంలో భీమలింగం కత్వ, భువనగిరి కోట తదితర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల్లోనే ఆలయ అభివృద్ధి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేసి ప్రభుత్వ దృష్టికితీసుకువచ్చి త్వరితగతిన పనులు మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఆయన వెంట ఆర్డీవో క్రిష్ణారెడ్డి, తహసీల్దార్‌ శ్యాం సుందర్‌ రెడ్డి, ఎండీవో శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు రామాంజనేయులు గౌడ్‌, గోళి పింగల్‌ రెడ్డి, పొట్టోళ్ల శ్యాంగౌడ్‌, సురకంటి సత్తిరెడ్డి, ప్రభాకర్‌, శివారెడ్డి, నరేందర్‌ రెడ్డి , రాజేశ బాబు, శ్రీనివాస్‌ గౌడ్‌, నిఖిల్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 12:52 AM